"1000 రూపాయలకే ?మర్డర్"

"నేటి 👁️నిఘా 🔎న్యూస్"
క్రైమ్ న్యూస్

(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా.
బ్రేకింగ్ న్యూస్ 
పోలీస్ కమిషనర్ నిజామాబాద్ జిల్లా పరిధిలో జరిగిన మర్డర్ కేసు కీలక అంశాలు గురించి ఈరోజు అదనపు పోలీస్ కమిషనర్   వేంకటేశ్వరలు మాట్లాడుతూ పోలీస్ కేసుల నిందితులను అదుపులోకి తీసుకుని కేసు వివరాలు వెల్లడించారు.
 తేదీ: 26.02.2022
పోలీసు స్టేషన్: Town III PS, Nizamabad
Crime.No. 40/2022 U/s 302,323,201 IPC
విచారణ అధికారి పేరు: కె. కృష్ణ, CIP, నిజామాబాద్ టౌన్
ఫిర్యాదిదారుని వివరాలు: షేక్ హమీద్ తండ్రి: Late షేక్ ఖాసిమ్, వయస్సు: 45 సంవత్సరాలు, కులము: ముస్లిం, వృత్తి. వ్యవసాయం, నివాసము: ఇంటి నెంబరు 1-117, చిన్నరాంపూర్ (గ్రా), బాన్సువాడ (మం), కామారెడ్డి (జి)
నేరస్తుడి వివరాలు:  మహమ్మద్ వాసిమోద్దీన్, తండ్రి:సలిమోద్దీన్,  వయస్సు: 23 సంవత్సరాలు, కులము: ముస్లిం, వృత్తి: ఫ్లవర్ మర్చంట్ వర్కర్,  నివాసము: ఇంటి నెంబరు 1-117, చిన్నరాంపూర్ (గ్రా), బాన్సువాడ (మం), కామారెడ్డి (జి)
చనిపోయిన వ్యక్తి వివరాలు: షేక్ సమియోద్దీన్, తండ్రి:హమీద్,  వయస్సు: 24 సంవత్సరాలు, కులము: ముస్లిం, వృత్తి: ఫ్లవర్ షాప్ వర్కర్,  నివాసము: ఇంటి నెంబరు 1-117, చిన్నరాంపూర్ (గ్రా), బాన్సువాడ (మం), కామారెడ్డి (జి)
పాత నేరచరిత్ర: లేదు
అరెస్టు చేసిన తేదీ మరియు స్టలము : 25.02.2022 at 15.00, పోలీసు స్టేషన్ టౌన్ 3, నిజామాబాద్
కేస్ యెక్క వివరాలు :
మృతుడు మరియు నేరస్థుడు ఇద్దరు అన్నదమ్ముల కుమారులు, వీరి సొంత గ్రామం చిన్నరాంపూర్ (గ్రా), బాన్సువాడ (మం), కామారెడ్డి (జి) చెందినవారు, వీరిద్దరు గతంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల ముస్తాఫ్ఫా ఫ్లవర్ షాప్ లో పనిచేశారు. పనిచేయడానికి ముస్తాఫ్ఫా వద్ద మహమ్మద్ వాసిమోద్దీన్ 45,000 రూపాయలు రెండు సంవత్సరాల క్రితం సమియోద్దీన్ సమక్షంలో తీసుకున్నాడు, కానీ తరువాత నేరస్థుడు వాసిమోద్దీన్ పనిచేయకపోవడంతో ముస్తాఫ్ఫా తాను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి తనకు ఇవ్వమని సమియోద్దీన్ కు మరియు వాసిమోద్దీన్ కు పలు మార్లు ఫోన్ చేసి అడుగగా, తేదీ 24.02.2022 నాడు అట్టి డబ్బులు ఇవ్వడానికి ఇద్దరు కలిసి రాంపుర్ నుండి నిజామాబాద్ కు మోటార్ సైకల్ పై వచ్చి వర్ని చౌరస్తా వద్ద వాసిమోద్దీన్ దిగిపోయి సమియోద్దీన్ ఒక్కడే ముస్తాఫ్ఫా షాప్ కు వెళ్ళి 44,000 రూపాయలు కట్టి, తిరిగి వర్ని చౌరస్తా వద్దకు రాగా వాసిమోద్దీన్ తన బందువు అయిన అల్లిమ్ కు ఫోన్ చేసి ఖిల్లా చౌరస్తా కు వెళ్ళి అలీమ్ ను వారి మోటార్  సైకల్ పై ఎక్కించుకొని కాలూర్ చౌరస్తా వద్ద గల విన్ను వైన్స్ కు వెళ్ళి అక్కడ I.B ఫుల్ బాటిల్ తాగి, అక్కడనుండి అలీమ్ ను ఇంటి దగ్గర దింపివేసి రాంపుర్ వెళ్ళి పోదామని, అక్కడ కి బయలుదేరి వెళ్తుండగా, విన్ను వైన్స్ కు కొద్ది దూరంలో వెళ్ళగానే  మహమ్మద్ వాసిమోద్దీన్ కు మజాస్ ఫోన్ చేసి నీవు సమియోద్దీన్ తో ఎన్ని పైసలు పంపినవు అని అడుగగా 45,000 పంపినాను అని చెప్పినాడు, వాసిమోద్దీన్ కు ముస్తాఫ్ఫా కు డబ్బులు కట్టడం ఇష్టం లేదు, సమియోద్దీన్ 1000 రూపాయలు తక్కువ ఇవ్వడంతో, కోపంతో నీవు 1000  రూపాలు ముస్తాఫ్ఫా కు ఎందుకు తక్కువగా కట్టవు అని సమియోద్దీన్ నెత్తి పై కొట్టిగా, అందుకు సమియోద్దీన్ బండి ఆపివేసి నేను దొంగనా, మజాస్ కు ఫోన్ చేసి అడుగుతా అని బండి దిగి వాసిమోద్దీన్ మరియు సమియోద్దీన్ ఒకరికొకరు కొట్టుకొని, వాసిమోద్దీన్ తన వద్ద వారి ఊరిలో కోళ్ళను కొచుటకు (ఆలాల్) వుంచుకున్న కత్తి ని తీసి సమియోద్దీన్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపినాడు, ఇట్టి గొడవలో వాసిమోద్దీన్ కుడి చెయ్యి బొటనవేలుకు కత్తి తెగి గాయం అయినది, అప్పుడు అలీమ్ వారిని ఆపడానికి ప్రయత్నించగా అతన్ని కూడా చంపుతానని చాకుతో బెదిరించగా అలీమ్ అక్కడి నుండి మోటార్ సైకల్ పై వాసిమోద్దీన్ పారిపోయినాడు, నిన్న నిజాంసాగర్ బస్ స్టాండ్ లో వున్నట్లు సమాచారం రాగా, అతనిని పట్టుకొని విచారించగా, తాను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం తో అతని యెక్క ఒప్పుకోలు స్వాదిన పంచనామా పంచుల సమక్షంలో నిర్వహించి, ఇట్టి నేరానికి ఉపయోగించిన కత్తి, మోటార్ సైకల్ మరియు రెండు సెల్ ఫోన్లను స్వాదినం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపనైనది.

ఈ కేసుని చేదించుటలో ముఖ్య పాత్ర వహించిన నిజామాబాద్ టౌన్ సి.ఐ కృష్ణ, టౌన్-3 పి.యస్ ఎస్.ఐ Ch. భాస్కర చారి,  టౌన్-3 పి.యస్ సిబ్బంది ఎం.డి.అఫ్సర్, షౌకత్ అలీ మరియు బి.అనిల్ లను గౌరవ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు IPS గారు అభినందించినారు. 
ఈ రోజు ఈ కార్యక్రమంలో గౌరవ పోలీస్ కమిషనర్ శ్రీ కెఆర్.నాగరాజు IPS, శ్రీ అదనపు డిసిపి అరవింద్ బాబు గారు, నిజామాబాదు ACP వెంకటేశ్వర్ గారు, నిజామాబాద్ టౌన్ సి.ఐ కృష్ణ, టౌన్-3 ఎస్.ఐ భాస్కర చారి మరియు సిబ్బంది పాల్గొన్నారు. అని మీడియా సమావేశం లో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026