"104 సేవలకు స్వస్తి ఎందుకు?"
"104 ఆరోగ్య సేవలు స్వస్తి?"
"నేటి 👁️నిఘా ఈ📰 న్యూస్ 📮డిజిటల్ మీడియా 🖥️"
"104 ఆరోగ్య సేవలు కు స్వస్తి" ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ప్రయత్నం చేస్తారా?
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
104 సేవలకు స్వస్తి
- గ్రామీణులకు నిలిచిన వైద్యసేవలు
- ఆందోళనలో దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, గర్భిణులు
- పునరుద్ధరించాలంటున్న గ్రామీణులు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి.
(నేటి నిఘా వైద్య విభాగం)
పల్లె ప్రజల ప్రాణాల పాలిట సంజీవనిగా పేరొందిన 104 వైద్యసేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను నిలిపివేయాలని ప్రత్యేక ఉత్త ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 174వాహనాల ద్వారా అందే సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పల్లెప్రజలకు ఉచితంగా వైద్య అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించారు. 104 వాహనం ద్వారా నిత్యం రోజుకు రెండు గ్రామాల చొప్పున సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మందికి దీర్ఘకాలిక రోగులకు, చిన్న పిల్లలకు, గర్భిణులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసే వారు. గ్రామంలోనే వైద్య చికిత్సలు చేసేందుకు ప్రత్యేక వాహనం రావడంతో పల్లెల్లో వైద్య సేవలు అందేందుకు చక్కటి అడుగులు వేసినట్లయింది. ఉమ్మడి జిల్లాలో 24వాహనాల ద్వారా నిత్యం మారుమూల గ్రామాల్లో 104సేవలు అందించేవారు. ఉదయం పూటనే గ్రామంలోకి రావడం అవసరమున్న వారికి ప్రాథమిక చికిత్సలు చేయడం, దీర్ఘకాలిక వ్యాధులకు మందులను పంపిణీ చేసేవారు. ఈ సేవల ద్వారా ప్రధానంగా గర్భిణులు, వృద్ధులు, అధిక రక్తపోటు తదితర రోగాలతో ఇబ్బందులు పడే వారికి ఊరట లభించేది. పట్టణాలకు వెళ్లకుండానే పల్లెల్లోనే వైద్య సేవలు అందడంతో సమయం, డబ్బు, ఆదాయ అయ్యేవి. 104 వైద్య సిబ్బంది తెలియజేసే విలువైన సూచనలు, సలహాలు ఎంత గానో ఉపయోగపడేవి. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 104 సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గ్రామస్థులకు సేవలు అందకుండా పోనున్నాయి. దీంతో వృద్ధులకు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ గ్రామంలోనే చక్కటి సేవలు అందించే 104సేవలు నిలిచిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయా గ్రామాల ప్రజలు చికిత్స కోసం పీహెచ్‌సీలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లలేక, తీసుకెళ్లే వారు లేక ఎన్ని ఇబ్బందులు పడాలో అని వారు ఆవేదన చెందుతున్నారు. 104 సిబ్బంది తమను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు చిక్సిత కోసం పట్టణాలకు వెళ్లాలి. లేకపోతే ఊర్లోని పీఎంపీ, ఆర్‌ఎంపీలను ఆశ్రయిం చాలి. వచ్చే కొద్దిపాటి పింఛన్ కాస్త మందులు, డాక్టర్ ఫీజులకే సరిపోతుందని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు.ప్రస్తుతం కొవిడ్ పెరిగి పోతుండడంతో చికిత్స పట్టణాల్లోకి వెళ్లలేని పరిస్థితి. అత్యవసరముంటేనే ఆస్పత్రికి రావాలని సూచిస్తున్నారు. కొవిడ్ ఆంక్షల నడుమ అధిక రక్తపోటు, షుగర్, ఎనీమియా, ఇతర వ్యాధి గ్రస్థులకు ఇప్పుడు ఎక్కడ లేని చిక్కులు వచ్చి పడినట్లయింది. అదీ కాకుండా 104 విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ ఎక్కడికక్కడ డిప్యూటేషన్లపైన పంపించేశారు.
చాలా ఇబ్బంది పడుతున్నారు
-విజయ్‌సింగ్, కాగజ్‌నగర్
104వైద్యసేవలు నిలిపివేయడంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. ఈ విషయాన్ని పునారోలించి 104సేవలు అందిస్తే బాగుంటుంది.
అధికారుల సూచన మేరకు నిలిపివేశాం
-మహేందర్, తెలంగాణ హెల్త్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
కొన్ని నెలల నుంచి 104వాహనాలు మారుమూల గ్రామాల్లోకి పోవద్దని ఉన్నతాధికారులు సూచించారు. అప్పటి నుంచి 104సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రోగులు ఫోన్లు చేస్తున్నారు. ఉన్న సిబ్బందికి ఇష్టానుసారంగా డిప్యూటేషన్లపై పంపిస్తున్నారు.అని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
ప్రజా ఆరోగ్యం పని చేయడం లో నిర్లక్ష్యం చేస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి
నేటి నిఘా న్యూస్
7097988840
Comments
Post a Comment