"నేటి👁️నిఘా🔎 భారీగా గుట్కా స్వాధీనం


     "భారీగా గుట్కా పాన్ స్వాధీనం"
క్రైమ్ న్యూస్.
(నిఘా న్యూస్ ప్రతినిధి)

పోలీసు కమిషనర్ కార్యాలయం పరిధిలో
      నిజామాబాద్ జిల్లా. మీడియా సమావేశం.
కేసు కీలక అంశాలు గురించి వివరాలు వెల్లడించిన అధికారులు.

▶️భారీగా నిషేధిత గుట్కా, 
     పొగాకు మరియు సిగరెట్లు 
     స్వాధీనం చేసుకున్న టాస్క్ 
     ఫోర్స్ సిబ్బంది
▶️వాటి విలువ దాదాపు రూ: 
     15,00,000/-
▶️ నిజామాబాద్ పోలీసు 
      కమిషనర్ 
 నిజామాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ K.R. నాగరాజు, IPS., గారి ఆదేశాల మెరకు బోధన్ టౌన్ PSకి చెందిన శర్బతి కెనాల్ వద్ద ఉన్న నిషేధిత గుట్కా, పొగాకు మరియు సిగరెట్ ఉత్పత్తులపై ఈ రోజు టాస్క్ ఫోర్స్  బృందంతో దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా  3 నిందితులను ఆధీనంలో కి తీసుకొని , 15 లక్షల విలువ గల నిషేధిత గుట్కా , పొగాకు , సిగరెట్లు మొదలగునవి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
1) Md.ఐజాజ్ అహ్మద్ S/o బాబు, 60 సంవత్సరాలు, R/o పాత బస్టాండ్, బోధన్ (మెటీరియల్ యజమాని) (పరారీలో ఉన్నారు).
 2) Md.మతీన్ S/o యూసుఫ్, 25 సంవత్సరాలు, కార్మికుడు, R/o షర్బతి కెనాల్.  బోధన్.
 3) షేక్ పాషా S/o మజీద్, 29 సంవత్సరాలు, R/o గౌషాల, బోధన్,                                            
 4) Md. నయీమ్ S/o లతీఫ్, 21 సంవత్సరాలు, R/o షర్బతి కెనాల్, బోధన్. 
 స్వాధీనం చేసుకున్న మెటీరియల్:
 గుట్కా, పొగాకు, సిగరెట్ తదితర ఉత్పత్తులను నిషేధించారు.           
 మొత్తం విలువ రూ.15,00,000/-.
 పై  స్వాధీనం చేసుకున్న మెటీరియల్ మరియు (3) నిందితులను తదుపరి చర్యల నిమిత్తం బోధన్ PSకి అప్పగించడము జరిగింది అని  K.R. నాగరాజు, IPS.,
              పోలీస్  కమిషరేట్ నిజామాబాద్ మీడియా సమావేశంలో తెలిపారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026