"కోటి గుట్కా స్వాధీనం" నేటి 👁️నిఘా💢 న్యూస్📰 పేపర్ 🗞️
*రూ.కోటి గుట్కా పట్టివేత*
నేటి నిఘా న్యూస్ ప్రతినిధి
క్రైమ్ న్యూస్ లైన్
అదిలాబాద్ జిల్లా.
భారీ గుట్కా పాన్ స్వాధీనం చేసుకున్న పోలీస్ ఆఫీసర్ .
ఆదిలాబాద్ పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో నిల్వ చేసిన నిషేధిత గుట్కా భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ కాలనీలోని ప్రైవేటు గోదాములో నిల్వ చేసిన రూ.40.30 లక్షల విలువైన గుట్కాను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. ఒక కోటి వరకు ఉంటుందని మావల పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇంత భారీ ఎత్తున గుట్కా నిల్వలు పట్టుబడటం జిల్లాలో ఇదే మొదటిసారి.
పట్టణానికి చెందిన వ్యాపారి సమీ ఉల్లాఖాన్ కర్నాటకలో ఆవాద్ భూషన్ త్రిపాఠి పేరిట కొనుగోలు చేసి ఇక్కడకు తరలించి మొహ్మద్ అబ్దుల్ జుబేర్కు చెందిన అద్దె గోదాములో నిల్వ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా మొదటి, రెండో నిందితులు సమీఉల్లాఖాన్, అవాద్ భూషణ్ త్రిపాఠి పరారైనట్లు పేర్కొన్నాడు. గుట్కా నిల్వ చేయటానికి ఇంటిని(గోదామును) అద్దెకు ఇచ్చిన మొహ్మద్ అబ్దులుబేర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో గుట్కాను స్వాధీనం చేసుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కే. పురుషోత్తంచారి, ఎస్ఐ ఈ.సాయన్నను ఎస్పీ అభినందించారు.
Comments
Post a Comment