"సేవాలల్ జయంతి" నేటి 👁️నిఘా 🔎న్యూస్
"సే వా లా ల్" జయంతి"
నేటి నిఘా న్యూస్ మీడియా.
కట్టా నరేశ్ కుమార్ నాయక్.
జర్నలిస్ట్
ముంబైలో
*సంత్ సేవాలాల్ జయంతికి నీరాజనాలు*
గౌతమ బుద్ధుని సమతవాదాన్ని అనేక సద్గురువులు సంతులు తమ భుజానికెత్తుకొని సమాజంలో ప్రచారం ప్రసారం చేశారు. అందులో అగ్రగామిలో మన రాయలసీమ గడ్డకు చెందిన బంజారా జాతి ముద్దు బిడ్డ సంత్ సేవాలాల్ మహారాజ్ ఒకరు. భారత సమాజంలోన్న అసమానత దుర్నీతి దూరాలవాట్లకు విరుద్ధంగా సదమార్గం నూరిపోసిన మహనీయులు మన సేవాలాల్ జీ అంటూ బహుజన సమాజ్ పార్టీ మహారాష్ట్ర కార్యదర్శి నాగసేన్ మాలజీ చరిత్రను వివరించారు. అదే విధంగా తెలంగాణలో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల అనేక తమ లంబాడీ ఎస్టి విద్యార్థి యువకులు లబ్దిపొందారన్న వాస్తవాన్ని తిరిగి జ్ఞపకం చేశారు. త్వరలో ప్రవీణ్ కుమార్ ముంబై షాహార్ కు రానున్నారని మరో బహుజన నేత కె.శ్రీనివాస్ చారి ఈ సందర్భంగా తెల్పారు. మంగళవారం ఉదయం బంజారా సేవా సంఘం (బి.ఎస్.ఎస్), గోర్ సేనా, గోర్ సిక్వాడి ఆధ్వర్యంలో ముంబై తూర్పు కన్జుర్ మార్గ్ లోని సద్గురు సేవాలాల్ 283 వ. జన్మదిన వేడుకలు జర్పారు. వీరు తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన తెలుగు లంబాడీ వలసజీవులు. ఆరంభంలో వీరు తమ సాంప్రదాయ వేషధారణలతో నృత్యాలు చేస్తూ రోడు పొడవునా భారీ రైలీతో ముంబైకర్లను ఆకట్టుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిలర్, సమాజ్ పెద్దలతో సభ
విజయవంతం ఐంది. ఇట్టి జయంతి ఉత్సవంలో స్థానిక తెలుగు సమజాసేవకులు అంజద్ భాయ్, జై భీం నేత శాంతిలాల్ బోర్డే, బి.ఎస్.ఎస్ కార్యకర్తలైన విశాలవత్ శంకర్, పాలవత్ రమేష్, పాలవత్ రాజు, విశాలవత్ దేవు, ననావత్ సోమ్ల, విశాలవత్ దేవి, పాలవత్ ఘామి, వి. సాక్షి, పి. పద్మ,
వి.చాందిని, నినావతి లీలాభాయి, మూల్ నివాసి మాలజీ తదితర్లు పాల్గొన్నారు. చివరికి విచ్చేసిన సభికులందరు రుచికరమైన బోజనాల్ని ఆస్వాదించారు.అని సేవాలాల్ జయంతి నిర్వాహకులు తెలిపారు.
7097988840 న్యూస్ వివరాల కోసం.
కట్టా నరేశ్ కుమార్ నాయక్ , ఎడిటర్.
7097988840
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా
Comments
Post a Comment