"యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక నిరుద్యోగ బృతి ఇవ్వాలని డిమాండ్"
నేటి నిఘా న్యూస్
(బ్రేకింగ్ న్యూస్)
(సనత్ నగర్, మీడియా ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు వెంటనే విడుదల చేయాలి. " ఓరం ప్రియాంక "
రాష్ట్ర ముఖ్యమంత్రి KCR వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇవ్వకా కాలయాపన చేస్తూన్నడని సనత్ నగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి ఓరం ప్రియాంక నేడు సికింద్రాబాద్ టకారబస్తిలో వున్న వారు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు.
ఉద్యోగాలు రాక అనేక మంది యువకులు ఆత్మ హత్యలు చేసుకొంటురని , ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకా , రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించేందుకు KCR గారు అనేక జిమ్మికులకు పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.
" నిరుద్యోగ బృతి " KCR గారికి ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు వస్తుంది. ఓట్లు దండుకొన్న తరువాత ఆ విషయాన్ని అటకేక్కిస్తారని దెబ్బిపొడచారు.
ఇప్పటికైనా TRS ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలని , నిరుద్యోగులకు వెంటనే " నిరుద్యోగ బృతి " అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఓరం డిమాండ్ చేశారు.
మా డిమాండ్ లను పట్టించుకోకుండా KCR ప్రభుత్వం నిర్లక్ష్యము చేస్తే , రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఇతర సనత్ నగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి , కిరీటా , వికాస్ , నరేష్ , సందీప్ ఆనంద్ , మల్లికార్జున్ , పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి 👁️నిఘా🔎 న్యూస్ 📰మీడియా🖥️
అవినీతి అక్రమాల పై నిఘా🔎
ఎడిటర్ .✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్ జర్నలిస్ట్.7097988840.📮
హైదరబాద్. తెలంగాణ.
Comments
Post a Comment