"అక్రమ ఇసుక డంపులు"
"అక్రమ ఇసుక డంపుల్"
(నేటి నిఘా న్యూస్)
*బాల్కొండ నియోజకవర్గం*
*నిజామాబాద్ జిల్లా*
*ఒక పక్క మంత్రి పర్యటనలు మరోపక్క అభివృద్ధి పనుల పేరుతో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా, జోరుగా అక్రమ ఇసుక నిల్వలు*
*బాల్కొండ feb26*
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి కోట్లాది రూపాయల సిసి రోడ్ల నిర్మాణాలకు, కోట్లాది రూపాయల నిధులతో బిటి రోడ్డు నిర్మాణం పనులు, బీటీ రోడ్డు అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీ భవనాలు, ఎనిమిది వందల కోట్ల రూపాయలతో గత వారం రోజులుగా బాల్కొండ మండలం పర్యటించి భూమి పూజ చేసి ప్రారంభించారు, అంతేకాకుండా జిల్లా కేంద్రంలో, కామారెడ్డిరెడ్డి జిల్లాలో సైతం మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనుల సిసి రోడ్లు, పలు అభివృద్ధి పనుల పేరుతో మండలంలోని పాలెం గ్రామం నుండి గత వారం రోజులుగా వే బిల్లులు లేకుండా యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తూ తిమ్మాపూర్ గ్రామంలో నూతన ఇల్లు ఇల్లునిర్మించుకునే వారికి అభివృద్ధి పనుల పేరుతో ఇసుక తరలిస్తూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతే కాకుండా అభివృద్ధి పనుల పేరుతో పాలెం గ్రామ శివారులో బుధవారం గత 15 రోజుల క్రితం రాంపులు, రోడ్లు ఏర్పాటు చేసి గురువారం ఒక్క రోజే ఒక కాంట్రాక్టర్ ,తెరాస నాయకుడు టుమారో 40 ట్రాక్టర్ ట్రిప్పులు ఇసుక రవాణా కొనసాగించి నిల్వలు ఏర్పాటు చేశారు. అంతకుముందు రెండు మూడు రోజులకు ఒకసారి నాలుగైదు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని అక్రమ ఇసుక రవాణా తిమ్మాపూర్ గ్రామంలో నిల్వలు ఏర్పాటు చేసుకున్నారు. పాలెం గ్రామ కమిటీ సభ్యులు జాతర నిర్వహించేందుకు గ్రామస్తులు లేకపోవడంతో, చేసేదేమీలేక జాతరను నిర్వహించాలన్న సదుద్దేశంతో కమ్మర్పల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందినఒక వ్యక్తికి అక్రమ ఇసుక రవాణా నడిపించు కునేందుకుగ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అనుమతినిచ్చారు. ఒక ట్రిప్పు ట్రాక్టర్ నడిపించు కుంటే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జాతర నిమిత్తం పద్దెనిమిది వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు డీడీలు చెల్లిస్తే రెవెన్యూ అధికారులు అభివృద్ధి పనులకు ఇసుక పాయింట్ నుండి అందిస్తున్నారు. కాగా అభివృద్ధి పనుల పేరుతో, ఇసుక రవాణా కొనసాగిస్తూ నిల్వలు ఏర్పాటుచేసి, రాత్రివేళ ఇసుక నిల్వల నుండినుండి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయం రెవెన్యూ అధికారులకు, పోలీసులకు, సమాచారం ఉన్నప్పటికీ, అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, ముడుపులు అందించడం, వల్ల అభివృద్ధి పనుల పేరుతో గ్రామాల జోరుగా కొనసాగుతోంది. అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వానికి ఆదాయం గండి కొడుతూ,అభివృద్ధి పనుల పేరుతో ఇండ్ల నిర్మాణాలు పేరుతో అక్రమంగా ఇసుక జోరుగా కొనసాగుతోంది.
ఒకపక్క మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎనలేని అభివృద్ధి కృషి చేస్తుంటే, మరోపక్క కొందరు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పైరవీలు చేస్తూ, అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అభివృద్ధి పనులకు ఇసుక కంకర అన్ని విధాలుగా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అవినీతి అక్రమాలకు పాల్పడవద్దని, అధికార పార్టీ నాయకులకు, అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అన్ని గ్రామాల ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలునాయకులకు ప్రజాప్రతినిధులకు సూచించినప్పటికీ, అక్రమ ఇసుక కొనసాగడం పట్ల ఆయా గ్రామాల రైతులు, ఆయా గ్రామాల ప్రజలు భూగర్భ జలాలు తగ్గు ముఖం ఏర్పడుతాయని, అంతేకాకుండ రైతులు పెద్ద వాగులో పైప్ లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేసుకుంటే, అక్రమ ఇసుక రవాణా వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పడతాయని,పైప్ లైన్లు పగిలిపోతాయి రైతులు అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ పోలీసు అధికారులు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న విషయం తెలిసినప్పటికీ తెలిసినా తెలియనట్లు గా, చూసినచూడనట్లుగా, వ్యవహరిస్తూ అందినంత ముడుపులు దండుకోవడం వల్లే రెవెన్యూ పోలీసులు సమాచారంలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక రవాణా వల్ల, పైరవీలు చేస్తున్న ఒకరిద్దరు నాయకుల వల్ల గ్రామాలలో ప్రజలు తెరాస పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాల, కాలనీల, అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల అవినీతి అక్రమాలు జోరందుకున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటి వరకు అవినీతి అక్రమాలకు పాల్పడవద్దని ఎన్నోసార్లు ఆదేశించినప్పటికీ,అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కుండా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తూ ప్రజల్లో అన్ని గ్రామాల కాలనీల ప్రజల మెప్పు పొందుతున్నారు. త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికార పార్టీలోని కొందరు నాయకులు, అధికారులు అవినీతికి పాల్పడకుండా, అన్ని గ్రామాలప్రజల మెప్పు పొందుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి యాట్రిక్ ఎమ్మెల్యేగా ఇప్పటికైనా కృషి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి పనుల పేరుతో అక్రమ ఇసుక రవాణా నియంత్రించాలని, అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు చేపడితే మళ్ళీ ఇలాంటి సంఘటనలు తలెత్తవని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.ఏదిఏమైనా అక్రమంగా ఇసుక రవాణా కొనసాగిస్తూ ఇసుకనిల్వలను సీజ్ చేసి, అభివృద్ధి పనులకు ఉచితంగా నీటి నిజాయితీగా అధికారులు అందించేలా జిల్లా కలెక్టర్, అద్భుత సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా
గట్టు భారత్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Comments
Post a Comment