"డ్రగ్స్ నిర్మూలించాలి"

డ్రగ్స్ నిర్మూలించాలి
(నేటి నిఘా న్యూస్ ✍️ ప్రతినిధి)
క్రైమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా.
పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్

నిజామాబాదు లో గంజాయి (మత్తుపదార్థాల) సేవించే వారికి "కౌన్సిలింగ్" నిర్వహించిన :పోలీసు కమిషనర్

   తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ ఆదేశాల మేరకు నేడు నిజామాబాద్ పోలీస్ శాఖ ,మరియు ఎక్సైజ్  శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ యందు గంజాయి (మత్తు పదార్థాలు) సేవించే వారికి "కౌన్సిలిం గ్ సమావేశం" నిర్వహించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు,IPS, గారు మరియు జిల్లా ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ,రాష్ట్ర డి.జి.పి సూచనల అనుసారంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దా డనికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా గంజాయి(మత్తు పదార్థాలు) సేవించడం అనేది చాలా తప్పు అని, యువత తప్పు దోవ పట్టకుండా  తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని ,వారి అలవాట్లను ఎల్లప్పుడూ గమనించాలని, యువత ఎల్లప్పుడు సన్మార్గంలో నడవాలని ,యువత వారి తల్లిదండ్రులు చాలా చిన్నచిన్న పనులు చేసి వారి పిల్లలను పోషిస్తున్నారని , తల్లిదండ్రులు వారి పిల్లల చదువుల కోసం చాలా రకాలుగా కష్టపడుతూ పోషిస్తున్నారని , వారి కష్టాన్ని గుర్తు చేసుకొని యువత తమ తప్పుడు అలవాట్లను మానుకోవాలని, మంచిగా ఉండాలని సూచించారు. నిజామాబాదులో గురువారం నాడు గంజాయి సేవిస్తూ దొరికిన వారి అందరినీ మొదటిసారిగా ఈ కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. చిన్నతనంలో తప్పుడు అలవాట్లకు అలవాటు పడినట్లయితే వారి భవిష్యత్తు మొత్తం తప్పుడు అలవాట్లతో అలవాటు పడుతూనే ఉంటాయని, అందుకు  గాను యువత ఎవరు కూడా తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మళ్లీ ఎవరైనా తమ తప్పు నడవడికను మార్చుకోనట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని పోవడం జరుగుతుందని, ప్రతిరోజు అందరి మీద " నిఘా" పటిష్టపరిచామని ,గంజాయి కి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసిన  నా వాట్సాప్ నంబర్:-94913-98540 కు తెలియజేయాలని,  సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.
   
   అనంతరం ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్  విశాల్ గారి ఆధ్వర్యంలో గంజాయి( మత్తు పదార్థాలు) సేవించే వారికి తమ శరీరంలో కలిగే నష్టాల గురించి క్షుణ్నంగా తెలియజేశారు. మత్తు పదార్థాలు సేవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. మత్తు పదార్థాలు వాడటం వలన ఎన్ని రకాలుగా నష్టాలు ఉంటాయో యూట్యూబ్ లో" డాక్టర్ విశాల్ ఆకుల "యందు  చూడవచ్చును అని తెలియజేశారు.

ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి "కరపత్రాలు" విడుదల చేశారు.
    ఈ సందర్భంగా నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. అరవింద్ బాబు ,నిజామాబాద్  ఏ.సీ.పీ శ్రీ వెంకటేశ్వర్, నిజామాబాద్ రూరల్ సీ.ఐ శ్రీ జగడం నరేష్, టౌన్ -VI  ఎస్సై శ్రీ ఆంజనేయులు , జక్రాన్ పల్లి ఎస్.ఐ శ్రీ  శ్రీకాంత్, భీంగల్ ఎక్సైజ్ సీ.ఐ శ్రీ వేణు, ఎస్.ఐ శ్రీ రామ్ కుమార్, ఎస్సై శ్రీ గంగాధర్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

"నేటి నిఘా న్యూస్ మీడియా"
*అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్*
మీ చుట్టూ జరిగే వాటి మీద నిఘా వేసి సమాచార ఇవ్వండి 7097988840 కట్టా నరేశ్ కుమార్ నాయక్. జర్నలిస్ట్


 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026