"గుట్టుగా గుట్ట లు తవ్వేస్తున్నారు"
"గుట్టుగా గుట్టలు తవ్వేస్తున్నారు"
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం,ప్రజా ప్రయోజనం దృష్ట్యా అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి:-
విషయం:- ధర్పల్లి మండలంలోని దొన్కల్ గ్రామం నుండి కోటాల్ పల్లి ప్రధాన B.T రోడ్డు నకు ఆనుకొని భారీ లోతు త్రవ్వకం పనులు చేస్తున్నారు,దీని వలన ప్రమాదం పొంచి వున్నది,ఇట్టి త్రవ్వకం పనులు ఆపుట గురించి.
నమస్కారములు సార్.
ధర్పల్లి మండలంలోని దొన్కల్ గ్రామం నుండి కోటాల్ పల్లి గ్రామము నకు వెళ్ళే ప్రధాన మార్గమునకు ప్రక్కననె "U"టర్న్ మూల మలుపు వద్ద చాల లోతుగా కందకం త్రవ్వకాల పనులు జరుగుతున్నాయి,ఇది చాలా ఎత్తయిన ప్రాంతముగాను, అలాగే నెల జారుడు స్వభావము రేగడి మట్టి కలిగి ఉండడం వలన వాహనాలు తరచుగా జారీ అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశాలు వున్నది, కావున ఇది ప్రయాణించే ప్రయాణికులకు రెప్ప పాటు కాలంలో మోటర్ చోదకులు ఏ మాత్రం జాగ్రత్తలు పాటించక పోయినచో వాహన చోదకులకు ప్రమాదము పొంచి యున్నదని భావిస్తున్నాము.
కావున ఇంతటి భారీ లోతు కందకం వలన ప్రమాదం పొంచి యున్నదని,కావున గౌరవనీయులు స్థానిక ప్రజా ప్రతి నిధులు,మరియు"జిల్లా డివిజన్ మెజిస్టీరియల్ స్థాయి న్యాయాధికారులుకలెక్టర్/RDO, గారు,మరియు మండల స్థాయి ఎక్జీక్యుటివ్ అధికారి తహశీల్దారు,భూగర్భ గనుల శాఖ,R&B శాఖ మరియు స్థానిక శాంతి భద్రతలు డివిజనల్ A.C.P స్థాయి&జిల్లా పోలీస్ అధికారులు,స్పందించి ప్రజా ప్రయోజనం దృష్ట్యా గమనించి తగు చర్యలు తీసుకోవాలని ఫోరం.ఫర్.ఆర్.టి. ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున యావత్ ప్రజానీకం సంక్షేమ దృష్ట్యా కోరుతున్నాము.
జి.బాలరాజు నాయక్, న్యాయవాది,&ఫోరం. ఫర్.ఆర్.టి.ఐ,జిల్లా అధ్యక్షుడు
నిజామాబాద్.
Comments
Post a Comment