"తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ మృతి"
నేటి నిఘా న్యూస్
"వీ ఆర్ ఏ గంగాధర్ మృతి"
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజవర్గం డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పల్లి గంగాధర్ వి ఆర్ ఏ విధులు నిర్వహిస్తూ ఈనెల 24 ఫిబ్రవరి 2022 తాసిల్దార్ కార్యాలయంలో రాత్రి విధులు నిర్వహిస్తూ చనిపోయిన సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాసిల్దార్ కార్యాలయం కి చేరుకొని కుటుంబసభ్యులు భార్య సుమలత , కుమారుడు కుశాల్, సావిత్రి తల్లి, కుటుంబ సభ్యుల దరఖాస్తు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పంచనామ చేసుకొని శవ పరీక్ష నిమిత్తం గంగాధర్
( డెడ్ బాడీ నీ) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డిచ్పల్లి ఎస్ఐ తెలిపారు.
వి ఆర్ ఏ గంగాధర్ మృతిచెందిన సంఘటన పై రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండల గ్రామాల నుంచి వీఆర్ఏలు తరలివచ్చారు.
నిజామాబాద్ జిల్లా వీఆర్ఏల సంఘం అధ్యక్షులు గైనీ సాగర్ మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామ రెవిన్యూ అధికారి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు రాత్రిపూట ఇటువంటి రాత్రి పూట (డ్యూటీలు)విధులు నిర్వహించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు కోరారు .
నిజామాబాద్ జిల్లా గ్రామ రెవిన్యూ సేవకులు సంఘం ఆధ్వర్యంలో సంతాపం ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లాలో గైని దయ సాగర్, జిల్లా అధ్యక్షులు, వేముల సాయ్యాన్న,కార్యదర్శి, చెలిమెల రాములు, డివిజన్ అధ్యక్షులు, గున్నము సంతోష్, డివిజన్ కార్యదర్శి, బియ్య సాయి నాథ్, సంయుక్త కార్యదర్శి, నిరాడి గంగాధర్, డిచ్ పల్లి మండలం అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు కందార్లు న్యస గణేష్, మురళి, అశోక్, ప్రభాకర్, వి ఆర్ ఎ లు తదితరులు పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా
ఎడిటర✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
7097988840.
నేటి నిఘా న్యూస్
Comments
Post a Comment