"నేటి 👁️నిఘా 🔎న్యూస్"

 *"నేటి👁️నిఘా🔎ఈ న్యూస్📰పేపర్🗞️డిజిటల్💢మీడియా🖥️"*

*"మత్తు పదార్థాలు నిర్మూలించాలి"*

అవినీతి అక్రమాల పై నిఘా
(న్యూస్ లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోకవర్గస్థాయిలో డిచ్ పల్లి మండలం లోని  మీటింగ్ హల్ డిచ్ పల్లి లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ ఉన్నతధికారులు , నిర్వహించిన సమీక్షా సమావేశం లో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తో  
నిజామాబాద్ పోలీస్  స్టేషన్ డిచ్ పల్లి ఏరియాలో   
పోలీస్ కమిషరేట్ పరిధిలో ఉత్తర్వుల పై  ... నిషేధిత డ్రగ్స్, గంజాయి రహిత సమాజం గా, నేటి మన సమాజం ను మార్చుటకు వారి అధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది.....

 ఇట్టి సదస్సుకు  డీ సి పి అరవింద్ బాబు, ముఖ్యఅతథిగా ఈ కార్యక్రమం లో  తెలంగాణ  యూనివర్సిటీ  వి సి. శ్రీ రవీందర్, జిల్లా ఎక్చేంజs సుపెర్డేంట్ నవీన్ కుమార్ , ఏసిపి వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
   ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
డి సి పి మాట్లాడు తూ గంజాయి, డ్రగ్స్ రహితం సమాజం ను మార్చేట  ప్రజలు, ప్రజాప్రతినిధులు , అధికారులు భాధ్యత.నేటి యువత ను వినాశనం వైపు తీసుకెళుతున్న డ్రగ్స్, గంజాయి కల్చర్ ను నిర్ములించడం మన అందరి బాధ్యత అని అందుకు గ్రామాలలో ప్రజలు,ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను  డ్రగ్స్, గంజాయి రహిత గ్రామాలుగా మార్చేందుకు దృఢ నిశ్చయంతో  ఉండాలని గ్రామసర్పంచ్ లు, ఎంపీటీసీ లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు  పిలుపునిచ్చారు.
 నిషేధిత డ్రగ్స్, గంజాయి గ్రామాలలో  డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డ్రగ్స్ , గంజాయి ని ఉత్పత్తి, సరఫరా చేసే వారి వెనుక  ఎంతటి వారు ఉన్న, ఏ పార్టీ వారు ఉన్న  వదిలే ప్రశక్తి లేదని అట్టి వారి పై పిడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాము అని తెలుపుతున్నాను.

👉 ఆన్ని  పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ గంజాయి రహిత గా మార్చేందుకు   గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లు, వార్డ్ మెంబెర్స్, విల్లెజ్ సెక్రటరీ లు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజలు బాధ్యతాయుతంగా కంకణ బద్ధులై ఉండాలని కోరున్నారు.

👉 గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు వ్యసనాలకు పాల్పడి మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్నెస్ ను కోల్పోవడం,  అనారోగ్యం బారినపడటమే కాకుండా తాము ఏమి చేస్తున్నామో అనే సెన్స్ ను కోల్పోయి, ఆర్థిక పరితిస్థితులు దిగ జారీ నేరాలకు పాల్పడటం జరుగుతుందని యువత పై అంతగా ప్రభావం చూపే డ్రగ్స్ ,గంజాయి పదార్థాల ఉత్పత్తి, సరఫరా ను తమ ప్రాంతంలో గుర్తించి పోలీస్ వారికి సమాచారం అందించుటకు  గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వార్డు మెంబర్లు అప్రమత్తంగా ఉండాలని కోరు న్నారు.
👉 డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, వినియోగం కు సంబందించిన  ఏమాత్రం అనుమానం వచ్చిన సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని అన్నారు. 👉గ్రామ స్థాయిలో   ప్రత్యేక ఇన్ఫర్మేషన్ కు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని కోరున్నారు.
 
👉గ్రామాలలో,  ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన  అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికిన ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని అలాగే పట్టా భూములలో గంజాయి దొరికిన ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్దుచేయడం జరుగుతుందని, గంజాయి మొక్కలు 4 దొరికిన సంబంధికుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి   పి డి. యాక్ట్ కేసునమోదు చేస్తామని అని తెలుపుచున్నము.
👉డ్రగ్స్  గంజాయి ను  సమూలంగా  అరికట్టడం లో ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామ ప్రజల పై కూడా బాధ్యత ఉందని, ఎక్కడైనా వాటి సరఫరా, ఉత్పత్తులు  జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భావించి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేయుచున్నాము.

👉తల్లితండ్రులు తమ పిల్లలు డ్రగ్స్, గంజాయి కు ఎడిక్ట్ అయినట్లు గుర్తించిన సీక్రెట్ గా పోలీస్ వారికి సమాచారం అందిస్తే వారిని కౌన్సిలింగ్ కు పంపడం జరుగుతుంది. 

👉 ఆ గ్రామనికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ రద్దుకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని ఈ విషయాన్ని  గ్రామాల ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సూచించినరు. 

అనంతరం
   *ప్ర తి జ్ఞ*

 మాయొక్క వీధిలో గాని, గ్రామములో గాని ఎవరైనా వ్యక్తులు అట్టి నిషేదిత  మత్తు పదార్థాలు సేవించినా, అమ్మినా, కొన్నా, రవాణా చేసినా లేదా గంజాయి మొక్కలు ఎవరయినా సాగు చేసినా వెంటనే నేను అట్టి సమాచారంను  సంబందిత పోలీస్ అధికారులకి సమాచారం అధిస్తాం అని మాయొక్క గ్రామమును పూర్తిగా గంజాయి/డ్రగ్స్ రహిత గ్రామముగా తీర్చిదిద్దుతాము ప్రతిజ్ఞ  చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృత్ఞతలు తెలిపారు.

"నేటి 👁️నిఘా 🔎న్యూస్"
ఈ✍️ న్యూస్ 📰పేపర్🗞️ డిజిటల్ 💢మీడియా☎️ 7097988840
కట్టా నరేశ్ కుమార్ నాయక్
సీనియర్ జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026