"నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం"
నేటి👁️నిఘా🔎న్యూస్
"అవినీతి అక్రమాల పై నిఘా"
"ఆత్మ నిర్భర భారత్ ప్రోగ్రాం"
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ అంశంలో ట్రైనింగ్ ప్రోగ్రాం స్థానిక కపిల మహిళా సొసైటీ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ , జిల్లా పరిశ్రమల సంస్థ తులసీ దాస్,రిటైర్డ్ బ్యాంక్ అధికారి మురళీమోహన్ ,జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ పాల్గొన్నారు.
ఈ ట్రైనింగ్ లో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ పథకం కింద కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను, బ్యాంకులు కల్పిస్తున్న ఋణ సదుపాయాలను, స్వయంసహాయక బృందాల వల్ల ఉపయోగాలను తెలియజేయడం జరిగింది.
మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడటం ఎలా అనే అంశాలు మీద ఈ శిక్షణ కార్యక్రమంలో సవివరంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కపిల మహిళా సొసైటీ నిర్వాహకురాలు గోపిక,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment