"NYK జిల్లా స్థాయి ఆటల పోటీలు"
"వన్డే టోర్నమెంట్"
నేటి నిఘా న్యూస్
(న్యూస్ లైన్ ప్రతినిధి నిజామాబాద్)
స్పోర్ట్స్ న్యూస్ కలెక్టర్ గ్రౌండ్ నిజామాబాద్.
*నెహ్రూ యువ కేంద్ర - నిజామాబాద్* ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ టోర్నమెంట్ ఖోఖో, కబడ్డీ ,వాలీబాల్, మహిళల, పురుషులకు క్రీడా పోటీలు 23-2-22 తేదీ రోజున వన్డే టోర్నమెంట్ జిల్లా క్రీడా (DSA) మైదానంలో( కలెక్టర్ గ్రౌండ్ ) లో నిర్వహించనున్నాం,
23వ తేదీ ఉదయం 9గంటలకి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పోటీలు సాయంత్రం 5గం లకు ముగియనున్నాయి.
పోటీల్లో పాల్గొనే అందరికీ కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడా మంత్రిత్వశాఖ ద్వారా ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది.
పాల్గొనే వారికి సూచనలు :-
1).ఒక క్రీడాంశంలో పాల్గొనే క్రీడాకారులు వేరే క్రీడల్లో పాల్గొన్నరాదు.
2).క్రీడాకారులకు భోజన వసతి కలదు
3).క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 23.02.2022బుధవారం రోజున ఉదయం 9గం లకు రిపోర్ట్ చేయవలెను.
4).ఈ టోర్నమెంట్ నందు పాల్గొనే టీమ్స్ 21.02.2022 తేదీ రోజూ సాయంత్రం 4 గంటల వరకు తమ ఎంట్రీ ఇవ్వగలరు, తరువాత ఎంట్రీస్ స్వీకరించబడవు.
ఇతర వివరాలకు సంప్రదించాల్సి ఫోన్ నంబర్
1. +917661919365
శైలి బెల్లాల్
జిల్లా యువజన అధికారిణి
నెహ్రూ యువ కేంద్ర
నిజామాబాద్
Comments
Post a Comment