"ఆర్టీఐ 2005 పై సమీక్ష సమావేశం"

*సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ*
"ఆర్టీఐ 2005 పై సమీక్ష సమావేశం "
"నేటి నిఘా న్యూస్ మీడియా"

 (న్యూస్ లైన్✍️ప్రతినిధి మార్చి.2022)
ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం సమావేశం నిర్వహించడం జరిగిందని  ఆర్టీఐ ఇంఛార్జి గంగాధర్ తెలిపారు.
ఈ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ నిజామాబాద్ రూరల్, అర్బన్ మండలాల కమిటీ ప్రతినిధులు సమావేశం  ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు,
కట్టా నరేశ్ కుమార్ నాయక్, (జర్నలిస్ట్) 
అర్బన్, రూరల్, కమిటీ,ప్రతినిధులు, గంగాధర్,ప్రభాకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, శంకర్ నరేశ్ లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఆర్టీఐ  చట్టం అమలు గురించి క్షేత్రస్థాయిలో  పని చేస్తున్న నిజామాబాద్ ఉమ్మడి మండలాల పరిధిలోని కమిటీల సభ్యుల కమిటీ ఇంఛార్జి గంగాధర్ (నిజామాబాద్ అర్బన్)
సమాచార దరఖాస్తు దారులు కార్యకర్తలు ఆర్టీఐ వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు
 ఈ కార్యక్రమంలో అర్బన్ మండల పరిధిలోని సమాచార దరఖాస్తులు, ఫిర్యాదులపై నమోదవుతున్న సమాచారాన్ని అందించడంలో సమాచార హక్కు చట్టాన్ని ప్రజాప్రయోజన ల కొరకు కృషి చేస్తున్న కార్యకర్తలకు దరఖాస్తుదారులకు వస్తున్న సమాచారాన్ని అందించే విధానాల గురించి లోటు పట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సమాచారం అందిన వెంటనే సమాచార రసీదులు పొందే విధంగా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని ఆయన తెలిపారు.
సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న  కార్యాలయాల్లో స్వచ్ఛంద సమాచారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో  అర్బన్ మండల, రూరల్ మండల పరిధిలోని కమిటీ కార్యకర్తలకు ముఖ్యమైన సూచనలను అనుసరించి సమాచార హక్కు చట్టంపై ప్రతి కార్యాలయంలో ప్రకటించే ప్రజా సమాచార అధికారి, పౌర సమాచార  అధికారి , అప్పిలేట్ అధికారుల వివరాలతో కూడిన సమాచార హక్కు చట్టం ప్రాథమిక బోర్డులను పట్టికలను ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రకటించే విధంగా  ఈ మండల పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల చొరవ తీసుకుంటున్నారో లేదో గమనించవలసిన అవసరం ఉందని దరఖాస్తుదారులకు ఫిర్యాదులకు పేర్కొనడం జరిగింది .
సమాచార హక్కు చట్టం వచ్చి 17 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు సమాచారాన్ని ప్రదర్శించడం సరిగ్గా లేదని  అసంపూర్తి సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారని  స్వచ్ఛందంగా ప్రకటించే పదిహేడు అంశాలపై అవగాహన కల్పించి ఈ కార్యాలయంలో బోర్డులు నిర్వహించే విధంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అధికారుల దృష్టికి  తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కమిటీ  దృష్టికి తీసుకు వచ్చిన రూరల్ మండల కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు పైన సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నా అధికార పై సమాచార కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త స్థానిక కార్యాలయంలో దరఖాస్తు చేసి సమాచారాన్ని పొందే విధంగా ప్రయత్నం చేయాలని ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా  సహకరిస్తున్న అధికారులకు ఆర్టీఐ చట్టం స్వచ్ఛంద కార్యకర్తలకు దరఖాస్తుదారులకు ఫిర్యాదు దారులకు  ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ నిజామాబాద్ అర్బన్, రూరల్ మండలాల కార్యకర్తలు కమిటీ సభ్యులు, రాజేశ్వర్, శ్రీనివాస్, నరేందర్, నాగభూషణం ,రమేష్, సురేష్ కుమార్, రాజ శేఖర్, ప్రవీణ్, చంద్రశేఖర్, ప్రదీప్ కుమార్, సుశీల్, నాగేష్, గజానంద్ రావు, శ్రీకాంత్, ప్రకాష్, రాజ్ కుమార్, మహేష్ బాబు, సుధీర్, సాయిలు, కార్తిక్, విజయ్ కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మిత్రులు తదితరులు పాల్గొన్నారు మీ అందరి సహకారంతో ఈ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ కి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026