"చలన్ భారీ తగ్గింపు ఈ 31 వరకే"

*చలన్స్ భారీ తగ్గింపు ఈ31 వరకే*
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)


*_*ఈ- లోక్‌అదాలత్‌తో ఉల్లంఘనదారులకు భారీ రాయితీలు**

*_*నో మాస్క్‌ జరిమానా వందే**

*_*ఈ చలాన్‌ వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింక్‌**

*_*అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి -సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌**

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనదారులకు శుభవార్త. 75 శాతం మాఫీ చేస్తూ పోలీసు అధికారులు బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించారు. వాహనదారులు ఈ మాఫీ అవకాశాన్ని నేటి నుంచి సద్వినియోగం చేసుకొని ఆన్‌లైన్‌లో పెండింగ్‌ చలాన్లు చెల్లించుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. తెలంగాణ ఈ చలాన్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్‌ను మంగళవారం నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

పేద, మధ్య తరగతి ప్రజలు గత రెండేండ్లుగా కొవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు శాఖ న్యాయాధికారులను సంప్రదించిన తర్వాత ఈ- లోక్‌అదాలత్‌ ద్వారా ఉల్లంఘనల దారులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద భారీ రాయితీని ఇస్తున్నట్లు వివరించారు. మార్చి ఒకటి నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని సూచించారు. మాస్కు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించామని, వారు వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఇదిలాఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్‌ చలాన్ల రుసుం రూ. 1800 కోట్ల వరకు ఉన్నదని పోలీసు వర్గాలు తెలిపాయి.

*మాఫీ ఇలా..*

రెండు, మూడు చక్రాల వాహనాలకు – 75%
ఆర్టీసీ డ్రైవర్లకు – 70%
లైట్‌, హెవీ మోటారు వాహనాలకు – 50%
తోపుడు బండ్లకు – 75%
నో మాస్కు కేసులకు – 90%

నేటి నిఘా న్యూస్ మీడియా
కట్టా నరేశ్ కుమార్ నాయక్ జర్నలిస్ట్
సెల్ 7097988840.
నేటి👁️నిఘా🔎న్యూస్ 💢ఈ 📰పేపర్🗞️
రిపొటర్లు కావలెను 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026