"ఉద్యోగ నోటిఫికేషన్ శిక్షణ కు అప్లికేషన్ 31 వరకే "

"ఉద్యోగ నోటిఫికేషన్ దరఖాస్తు ఈ నెల 31 వరకు"
*నేటి నిఘా న్యూస్ మీడియా*
(న్యూస్ లైన్ ప్రతినిధి మార్చి 2022.)
పోలీస్ కమిషనర్ కార్యాలయం
నిజామాబాద్


            తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్. ఐ ఈ పోస్టులకు సంబంధించి గౌరవ రాష్ట్ర డీ.జీ.పీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రోడ్డు మరియు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్  శ్రీ కె ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ క్యాంపు నిర్వహించబడును

            ఇట్టి ఫ్రీ కోచింగ్ క్యాంపుకు రోడ్డు మరియు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో స్టడీ మెటీరియల్ మరియు అనుభవం ఉన్న అధ్యాపకులు (ఫ్యాకల్టీ )చేత తరగతులు నిర్వహించబడును కాబట్టి, ఇట్టి ఫ్రీ కోచింగ్ కు నిజామాబాద్ పోలీస్ శాఖ వారి చేత కోచింగ్ నిర్వహించబడే స్థలము ఏర్పాటు చేయబడును.

             ఇట్టి స్క్రీనింగ్ టెస్ట్ కు దరఖాస్తులు తేదీ 31.03.2022 వరకు ఆన్లైన్లో స్వీకరించ బడును.
 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తేదీ: 03.04.2022న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడును.  స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడే స్థలము మరియు సమయము త్వరలో తెలుపబడును. కావున నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించు కొనగలరు.

          కె.ఆర్. నాగరాజు, IPS.,
            కమిషనర్ ఆఫ్ పోలీస్ 
                   నిజామాబాద్ ఓ ప్రకటనలో                              తెలిపారు

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026