"భగత్ సింగ్ 91వ నివాళి"
*కామర్పల్లి లో భగత్ సింగ్ విగ్రహానికి 91 వ వర్ధంతి సందర్భంగా పూల మాలలు వేసి ఘన నివాళి*
నేటి నిఘా న్యూస్ మీడియా
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
*మరో స్వతంత్ర పోరాటానికి భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడుదాం... సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా*
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహానికి 91 వర్ధంతి సందర్భంగా cpiml ప్రజాపంథా కమ్మర్పల్లి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఇ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాలు తెల్ల దొరలు మన దేశాన్ని పట్టి పీడించి, ప్రజల రక్తమాంసాలు లేని తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పీడకుల పీడ వదలాలంటే తెల్లదొరలను ఏడు సముద్రాలు దాటి చాలని ఏకైక మార్గం ప్రజా పోరాట కామ్రేడ్, భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్ దేవ్ అనేక పోరాటాలు నిర్వహించని కాదు. ప్రపంచ ప్రజలకు వీరి దుర్మార్గులను దుర్మార్గాలను తెలియజేయడానికి పార్లమెంట్లో పొగ బాంబులు వేసి సంచలనం సృష్టించారు. నాటి యువతకు నిద్ర మేలుకొలిపి బ్రిటిష్ వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమే నిజమైన దేశభక్తి అని ఎలుగెత్తి చాటారు.
భగత్ సింగ్. రాజ్ గురు సుఖ్ దేవ్ కన్న కలలు సామ్రాజ్యవాద దోపిడీ లేని., దళారీ వ్యాపారుల భూస్వాముల దోపిడీ లేని రాజ్యం కావాలని, అంత గౌరవంగా సమానంగా., బతికే విధంగా ఉత్పత్తి సాధనాలపై హక్కు సాధించే విధంగా ఆ రాజ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
నేటిప్రభుత్వాలు. యువతను పక్కదోవ పట్టించే విధంగా, వాస్తవాలను తెలుసుకో కుండ, ఉండేవిధంగా మత్తులో ముంచుతున్నారు అని, హైస్కూల్ స్థాయిలోనే మత్తు పదార్థాలు గంజాయ్ సప్లై ఏ విధంగా వ్యాపార వర్గాలు వ్యాపారం చేస్తుంటే కళ్లు మూసుకున్న ప్రభుత్వాలు యువతను ఉద్దేశించి కనీస చైతన్య పరిచే కార్యక్రమాలు లేకుండా చేస్తున్నాయని అన్నారు.
కులం మతం లేని సమానత్వం , గౌరవం పంది రాజ్యం కొరకు పోరాటం చేయడమే నిజమైన భగత్ సింగ్ సమర్పించే నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. సబ్ డివిజన్ కార్యదర్శి సురేష్, అఖిలభారత రైతుకూలీ సంఘం డివిజన్ నాయకులు. సత్యనారాయణ, జి కిషన్, pow నాయకులు సత్య అక్క, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment