*మంగంపేట లోని డ్రైనేజీ సమస్యలను ఎండి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి*

 *మంగంపేట లోని డ్రైనేజీ సమస్యలను ఎండి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి*
నేటి నిఘా న్యూస్ మీడియా

(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
:ఓబులవారిపల్లె మండలం
మంగంపేట మార్చి 19 రైల్వే కోడూరు రిపోర్టర్ పులి వెంకటేష్:



కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట కు విచ్చేసిన ఏపీఎండిసి ఎండి వెంకటరెడ్డి గారికి యువ పారిశ్రామికవేత్త, వైసిపి యువజన నాయకుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బందిగా మారిన డ్రైనేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంగంపేట లోని ఆర్ఆర్-1 సెంటర్ 1వ స్ట్రీట్ నుండి 14వ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తూ ఉండడం, పక్కనే నేషనల్ హైవే ఉండడం వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే అండర్ డ్రైనేజ్ పనులు చేపడితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగవని  తల్లెం భరత్ కుమార్ రెడ్డి  మంగంపేటకు విచ్చేసిన ఎండి వెంకట్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజలు ఇబ్బంది పడకుండా  వెంటనే డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపుతామని పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న సిపిఓ వెంకటరమణ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 
అంతేకాకుండా మంగంపేట గ్రామపంచాయతీలోని డేంజర్ జోన్ పరిధిలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లడంతో సాధ్యమైనంత వరకు సమస్యలు ఏమి లేకుండా చేసి మోడ్రన్ విలేజ్ గా తీర్చి దిద్దుతామని ఈ సందర్భంగా ఎండి వెంకట్ రెడ్డి గారు తెలియజేసినట్లు భరత్ కుమార్ రెడ్డి వివరించడం జరిగింది.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026