"యువతా మేలుకో నిన్ను నువ్వు ఏలుకో"
"యువతా మేలుకో నిన్ను నువ్వు ఏలుకో"
(నేటి ని ఘా న్యూస్ మీడియా ప్రతినిధి)
న్యూస్ లైన్. మార్చి 11 నిజామాబాద్ జిల్లా. అంబేద్కర్ భవన్
యువతా మేలుకో...
మత్తుపదార్థాలను మత్తు పానీయాలను
నిర్మూలించాలని ప్రతిజ్ఞ సంతకాల సేకరణ కార్యక్రమం
యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.
అర్హులైన యువతకు ఫిజికల్ ఫిట్ నెస్, అర్హత పరీక్ష కోసం సన్నద్ధం చేస్తాo..
యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు..
మత్తు మిమ్మల్లి, మీ కుటుంబన్ని ఛిద్రం చేస్తుందని.. సి పీ నాగరాజు అన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేనావత్ చైత్రమ్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత మేలుకో, నిన్ను నీవు ఏలుకో మద్యం, మారక ద్రవ్యాలు యువత ఎదుగుదలకు అవరోధాలు పై అవగహన సదస్సు ఖలీల్ వాడి లోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా సీపీ కె. ఆర్ నాగరాజు, ఏ సి పీ వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యూరో సైకియాట్రీస్ట్ , డ్రగ్ ఆడిక్షన్ స్పెషలిస్టు డాక్టర్ విశాల్, చందమామ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బిలోజీ నాయక్ , ప్రముఖ న్యాయవాది ఆశ నారాయణ విచ్చేశారు..
ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ముఖ్యఅతిథి సి పి నాగరాజు మాట్లాడుతూ..
దేశ వ్యాప్తంగా 9 మిలియన్ మంది గంజాయికి అలవాటు పడ్డారని గణాంకాలు చెబుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మారక ద్రవ్యాలు గంజాయి నిర్మూలన కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పోలీస్ శాఖ ద్వార ఎక్కడ గంజాయి దొరికిన ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుందని, గంజాయి నిర్ములన కోసం ప్రజా ప్రతినిధులను ఇందులో పాలు పంచుకొనెలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, యువత ఎవరైనా మత్తుకు బానిసై తే మాకు తెలియజేస్తే వారి జీవితాన్ని మంచి మార్గoలో పెట్టే అవకాశం ఉందని, మీ ఒక్క ఫోన్ కాల్ తో వారినే కాకుండా వారి కుటుంబాన్ని కాపాడిన వారు అవుతారని అన్నారు..ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్స్ వేసి త్వరలో ఉద్యోగాలు ఇవ్వనున్నoదున యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి వారి తల్లిదండ్రులనుబాగా చేసుకోవాలని అన్నారు. అర్హత కలిగిన యువతకు పోలీస్ తరఫున పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తామని అన్నారు..
యువత సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని కోరారు..అబ్దుల్ కలాం చెప్పినట్లు
యువత కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా
అంబేద్కర్ లా చదివి మీ కుటుంబానికి, దేశానికి బాసటగా నిలవాలని అన్నారు.
ఒక దేశం నాశనం కడవడానికి కారణం మత్తు పదార్థాలు కారణమని ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. యువత చేతిలో మీ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్ ఉందని గుర్తించాలి అన్నారు.యువత తలుచుకుంటే ఏదైనా సాదించగలరు అని, యువత చేతుల్లో దేశ భవిష్యత్ ఉందని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తే వారు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడుతూ వారికి చెడ్డ పేరు తీసుకురావద్దని, ఉద్యోగాలు సంపాదించి వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్నారు..
మదాక ద్రవ్యాల నిర్ములణ కై సి.పి నాగరాజు గారి తో పాటు విద్యార్ధులు సంతకాల సెకరణ
అలరించిన పాట..
మత్తు పదార్థాలు తీసుకుంటే కలిగే నష్టాలపై, తల్లిదండ్రుల విలువ తెలుసుకో అంటూ, పోలీసు యంత్రాంగం పై పోలీస్ కళాజాత కళాకారిణి జాన్ సీత పాటలు యువతను ఆకట్టుకున్నాయి..యువతను, వేదిక మీదున్న వారిని అలరింపచేసాయి..
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు,
tvuv జిల్లా అధ్యక్షుడు అజయ్, కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నవీన్ , నగర అధ్యక్షుడు సందీప్, నర్సగౌడ్, సర్దార్ నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు..
నేటి నిఘా న్యూస్ మీడియా న్యూస్ పేపర్ డిజిటల్ నెట్ వర్క్.
నేటి నిఘా న్యూస్
ఎడిటర్
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్ 7097988840.
Comments
Post a Comment