ముంబై లో ఛలో ఆర్మూర్ పోస్టర్ ఆవిష్కరణ
*ముంబైలో*
*చలో ఆర్మూర్ సభ కరపత్రం ఆవిష్కరణ*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
(న్యూస్ లైన్ ప్రతినిధి) మార్చి 2022.
చరిత్రాత్మక 300ల రోజుల మహాయాత్రలో బాగంగా జిల్లా నిజాంబాద్ ఆర్మూర్ పట్టణంలో డెబ్భై మంది బీసీలను అసెంబ్లీకి పంపించే బహుజన రాజ్యాధికార సంకల్ప సభ ఏప్రిల్ 3న జరగనుంది. అట్టి సభకు సంబంధించిన కరపత్రాన్ని ముంబైలోని "డాక్టర్ ఆర్.ఎస్.పి అభిమాన బృందం", పలు సంఘాలచే శనివారం సాయంత్రం సైన్ ఏరియాలోని ఎం.టి.ఎస్ సంఘంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా "బృందం" నేత నాగసేన్ మాలజీ మాట్లాడుతూ కేవలం కరపత్రం విడుదలయేగాక ఇక్కడి నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రత్యేక్షంగా ఆర్మూర్ సభకు బయలు దేరనున్నామని, దాని కోసం నగరంలోని ఎస్సి ఎస్టి ఓబీసీ వలసజీవులను కదిలించే పనిలో ఉన్నామని గౌరవంగా తెల్పారు. ఈ ప్లానింగ్ సమావేశంలో "బృందం" కార్యకర్తలైన అక్కినపెల్లి శ్రీనివాస్ చారి, గాయకులు భీంరత్న మాలజీ, అనంచు సుధాకర్, డి.లింగం మాలజీ, బర్కుంట ఆనంద్, కె. గంగాధర్, ముంబై తెలుగు మాదిగ మహాసంఘం పదాదికారులు తెడ్డు బాబు, గంటని బాలకృష్ణ, నల్లూరి బాబు మహారాజ్, ఏనుగంటి నరేంద్ర, ముంబై తెలుగు సేవా సంఘం ప్రముఖులు సులం బాబూరావు, బొల్లే శివరాజ్ తదితర్లు ఆహ్వాన పత్రాల్ని ఆవిష్కరించారు.
ఎం. మాలజీ :
నేటి నిఘా న్యూస్ మీడియా
"అవినీతి అక్రమాల పై నిఘా"
ఎడిటర్.
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.7097988840.
Comments
Post a Comment