"కోడూరు నుంచి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే"
*ఎమ్మెల్యే సారు మీకు కృతజ్ఞతలు
అంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
:రైల్వే కోడూర్ మార్చి 16
(నేటి నిఘా న్యూస్)
పులి వెంకటేష్:
రైల్వే కోడూరు మండలం లోని కె బుడుగుంట పల్లి గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు విద్యార్థుల కోసం సోమవారం నుండి ఆర్టిసి డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు కోడూరు నుండి ప్రతిరోజు ఉదయం 9'15, సాయంత్రం 4, గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు బస్సు వెళ్తుందని రాజుపేట డిపో అధికారులు తెలిపారు విద్యార్థులే కాకుండా ఇతరులు కూడా ప్రయాణించవచ్చు అన్నారు గతంలో డాక్టర్ ఎం శ్రీలత వారి బృందం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు దృష్టికి తీసుకొని పోవడంతో స్పందించిన ఎమ్మెల్యే రాజంపేట డిపో మేనేజర్ కు ఫోన్ చేసి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడపాలని ఆదేశించటం తో సోమవారం నుండి బస్సు నడుపుతున్నారు
ప్రిన్సిపాల్ తో పాటు లెక్చరర్ల బృందం విద్యార్థులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు రోడ్డు ఇరుకుగా ఉంది కోడూరు సర్పంచ్ కె బుడుగుంట పల్లి సర్పంచులు స్పందించి రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొన్నారు
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
అవినీతి అక్రమాల పై నిఘా
Comments
Post a Comment