"విజిలెన్స్ మీటింగ్స్ పెట్టండి"

"మానిటరింగ్ కమిటీ మీటింగ్ పెట్టండి"
(నేటి నిఘా న్యూస్  ప్రతినిధి)
ఎస్సీ , ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం అన్ని రకాల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరిపేందుకు జిల్లా కలెక్టరు లకు సిఫార్సులు చెయ్యండి.

     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి కెవిపిఎస్ వినతిపత్రం 
  కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాలాద్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు రెవెన్యూ డివిజన్ పరిధిలో మండలాలులో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని మరియు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఈ సమావేశాల్లో దళితులపై జరుగుతున్న దాడులు దళితులు జరుగుతున్న అన్యాయాలపై చర్చించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కానీ ఎక్కడ జరగడం లేదన్నారు . మండల స్థాయిలో ఈ కమిటీలు జరపాలనే సృహా ఏ మండల ,రెవెన్యూ అధికారులకు లేదన్నారు . అసలు సమావేశాలు జరగడం లేదన్నారు . జిల్లాల కలెక్టరు లు సరిగ్గా జరపడం లేదన్నారు . జరిపేందుకు అన్ని జిల్లాల కలెక్టర్స్ కు సిఫార్సులను పంపించాలని కోరారు . అదేవిధంగా దళితులపై దుర్మార్గమైన కులదురహంకార దారుణమైన కులవివక్ష, దాడులు , అత్యాచారాలు , హత్యలు పెరిగిపోతున్నాయని , భూసమస్యలు పెరిగిపోతున్నాయని 13 జిల్లాలకు సంబంధించి దళితులు దూర ప్రాంతాల నుండి మిమ్మల్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారని వారికి బస చేయడానికి లాడ్జీలను ఆశ్రయించిన పలితంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వీరి కోసం విజయవాడ లో భవనం సదుపాయం కల్పించాలని దూరప్రాంతం నుండి వచ్చేవారికి న్యాయం చెయ్యాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
   కమీషన్ ఛైర్మన్ అన్ని జిల్లాల కలెక్టర్స్ కి అన్ని రకాల విజిలెన్స్ మానిటరింగ్ సమావేశాలు జరపాలని ఉత్తర్వులు పంపారు ...
    కలిసిన వారిలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరెల్లి చిరంజీవి , లోవరాజు తదితరులు ఉన్నారు .....
      అభినందనలతో.... 
    అండ్ర మాల్యాద్రి 
       రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 

నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026