"మత్తు పదార్థాలు నిర్మూలించాలి ప్రతిజ్ఞ"
*మోర్తాడ్ మండలం ఈ మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి*
*మోర్తాడ్ మార్చి 02*
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ లో మోర్తాడ్ ఎస్. ఐ. ముత్యం రాజు ఆధ్వర్యంలో, భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు సమక్షంలో జిల్లా సి పి నాగరాజు ఆదేశాల మేరకు మోర్తాడ్ మండలపోలీసులు, ప్రజా ప్రతినిధులు ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్ మోర్తాడ్ సర్పంచ్ భోగ ధోరణి ఆనంద్, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, యువకులు సైతం ఈ కార్యక్రమానికి విచ్చేయడం,మాదకద్రవ్యాల నియంత్రణ పై చేపట్టిన పోలీసులు మోర్తాడ్ లోని గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ భారీ ర్యాలీ లో వివిధ మండలాల పోలీసు అధికారులు, ఏ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ లు, ప్రజా ప్రతినిధులు యువకులు మాదకద్రవ్యాలా నియంత్రణపై ర్యాలీలో నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. అనంతరం మాదకద్రవ్యాల నియంత్రణపై భీంగల్ సిఐ, వివిధ మండలాల ఎస్సైలు ,పోలీసులు ఎంపీపీ, సర్పంచ్, యువకులు మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీఐ భీంగల్ సిఐ ఈ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా సీపీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణ పై భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. మోర్తాడ్ మండలంలోని అన్ని గ్రామాలలో గంజాయి, గుడుంబా, సారా, గుట్కాలు, క్లోరిన్, లాంటి మత్తు బాధాకరం యువకులు సేవించి తమ కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా, ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించిన, సేవించిన పోలీసులకు సమాచారం అందించి మాదక ద్రవ్యాల నియంత్రణమండలంగా తీర్చి దిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, యువకులు, నాయకులు సమాచారం అందించిపోలీసుల కు సహకరించి ఒక్కరు కృషి చేయాలని భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణపై భీంగల్ సిఐ వెంకటేశ్వర్లు, మోర్తాడ్ ఎస్ఐ ముత్యం రాజు, పోలీసులు మండల, గ్రామ, ప్రజాప్రతినిధులు, యువకులు చేపట్టిన మాదకద్రవ్యా లార్యాలీకి, ప్రతిజ్ఞ కు, మోర్తాడ్ మండలం ఎక్సైజ్ సిఐ గుండప్ప సకాలంలో హాజరు కాకపోవడం చర్చనీయంగా మారింది. మాదక ద్రవ్యాల నియంత్రణ పై పోలీసులు ఎక్సైజ్ అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సి ఉండగా మోర్తాడ్ మండల అధికారులకు చిత్తశుద్ధి లేదని ఈ కార్యక్రమంలో తేటతెల్లమైందని పలువురు యువకులు చర్చించుకోవడం చర్చనీయంగా మారింది. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండలం గీత కార్మిక సంఘం సభ్యులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా
గట్టు భరత్,మోర్తాడ్*
*బాల్కొండ నియోజకవర్గం*
*నిజామాబాద్ జిల్లా*
ఎడిటర్ . నేటి నిఘా న్యూస్.
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.7097988840.*
Comments
Post a Comment