"కొమురం భీమ్ విగ్రహం"కోసం విన్నపం"

 *"కొమురం భీమ్ విగ్రహం ఏర్పాటు చేయాలి"*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
మహబూబాబాద్ స్థానిక బస్టాండ్ వద్ద గల వివేకానంద సెంటర్ లో 
కొమరం భీం మ్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలి:
(నేటి నిఘా న్యూస్ మీడియా)
(మార్చ్ 2022)

మహబూబాబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ ప్రసన్న రాణి గారిని కలిసి కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆదివాసీల ఆరాధ్యదైవమైన కొమురం భీం గారి విగ్రహం రోడ్డు వెడల్పు లో భాగంగా మున్సిపల్ అధికారులు తీసి పక్కన పెట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. 
ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా మా ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కొమరం భీం గారి విగ్రహాన్ని వివేకానంద సర్కిల్ ప్రదేశంలో ప్రతిష్టించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం  మహబూబాాద్ జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, జిల్లా కార్యదర్శి దబ్బ శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు దబ్బ సాంబయ్య పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్ 
ఎడిటర్
కట్టా నరేశ్ కుమార్ నాయక్
 జర్నలిస్ట్ 7097988840

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026