"అగ్రహారం పరిసరాల పరిశుభ్రత"
*ఆర్ ఆర్ సెంటర్-2 అగ్రహారం స్మశాన వాటికను శుభ్రం చేయించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి, వార్డ్ మెంబర్లు*
"నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి"
(ఓబులవారిపల్లె మండలం మార్చ్ 23)
రిపోర్టర్ పులి వెంకటేష్:
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామపంచాయతీకి చెందిన ఆర్ఆర్ సెంటర్-2 అగ్రహారం శివారులో ఉన్న స్మశాన వాటికల్లో పిచ్చి మొక్కలు చెట్లు విరివిగా పెరగడంతో అంత్యక్రియలు జరుపుకోవడానికి అనువుగా లేదని వార్డు మెంబర్లు అయినా కురసాల శారదమ్మ,కొవ్వూరు రామలక్ష్మమ్మ లు యువ పారిశ్రామికవేత్త వైసిపి యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి స్మశాన వాటికను శుభ్రం చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ మరియు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు జరుపుకోవడానికి స్మశాన వాటికలు పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందని మంచి ఉద్దేశంతో వార్డు మెంబర్లు కురసాల శారదమ్మ,కొవ్వూరు రామలక్ష్మమ్మ లు ఆర్ ఆర్ సెంటర్ 2 అగ్రహారం శివారులో ఉన్న స్మశాన వాటిక పిచ్చి మొక్కలతో ఏవుగా పెరిగిన కంప చెట్లు అధికంగా ఉండడంతో వచ్చేవారికి సరైన మార్గం లేకపోవడంతో ఈ సమస్యలన్నీ నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే ఈ విషయంపై స్పందించి పిచ్చి మొక్కలు తొలగించి సరైన రహదారిని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు
Comments
Post a Comment