"క్షయ వ్యాధి నిర్మూలన"
*క్షయ రహిత జిల్లానే మన లక్ష్యం*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
(న్యూస్ లైన్ ప్రతినిధి మార్చి 2022)
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నివారణ దినోత్సవ వేడుకలను ముందుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ నిజాంబాద్ జిల్లా క్షయ రహిత జిల్లాగా మర్చాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది .తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం సార్ గారి ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్లో క్షయ వ్యాధి నివారణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ శేఖర్ గారు ముఖ్యఅతిథిగా హాజరైనారు .ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం గారు మాట్లాడుతూ జిల్లాలో క్షయ నియంత్రణకు వివిధ స్థాయిల్లో చేపట్టిన టువంటి కార్యక్రమాలను మరియు వ్యాధి లక్షణాలు వ్యాధి వ్యాప్తి చెందే విధానం వ్యాధి చికిత్సకు అవసరమైన ఎటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నామో వివరించారు ఈ సందర్భంగా జిల్లా కు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. జిల్లాలో 40 శాతం వ్యాప్తికి తగ్గించినందు వల్ల జాతీయస్థాయిలో లో సిల్వర్ మెడల్ సాధించినందుకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ మనసుకు మాండవీయ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ తీసుకోవడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది అన్నారు .ఇదే స్ఫూర్తితో పని చేస్తూ వ్యాధి నియంత్రణ 80% అరి కట్టి బంగారు పతకాన్ని సాధిస్తామని భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా ను టి బి రహిత జిల్లాగా మార్చడమే మా లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా మేయర్ నీతి కిరణ్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నియంత్రణలో వైద్య సిబ్బంది చాలా అంకితభావంతో పని చేయడం వల్లనే నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగిందని మరియు ఎఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సేవలందించి టీబీ వ్యాధి నియంత్రణకు కృషి చేయడం హర్షించదగ్గ విషయమని ఈసందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతి మరాజ్ మాట్లాడుతూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో క్షయ వ్యాధి నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఐ ఎమ్ ఏ సెక్రెటరీ డాక్టర్ జలగం జలగం తిరుపతి రావు మాట్లాడుతూ క్షయ వ్యాధి కోసం వైద్యులు ఏవిధంగా చర్యలు చేపడుతున్నారు క్షయ వ్యాధి వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ సoదర్భంగా పాఠశాల విద్యార్థులకు క్షయ వ్యాధిపై వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరిగింది గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేయండి జరిగింది అదేవిధంగా క్షయ వ్యాధి నియంత్రణలో ప్రతిభ కనబరిచిన ఆశా కార్యకర్తలకు వైద్య సిబ్బంది వైద్యులు సంజీవ్ రెడ్డి మక్లుర్ phc,తరుణం నాజ్ మాలపల్లి,స్టెఫీ రాని ఎర్గట్ల,మరియు ఎన్టి ఈపి , సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సన్మానించడం జరిగింది. ఈ వేడుకల్లో క్షయ పైన కళా బృందం చేత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎడి డ్రగ్క్స్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విద్య ,డాక్టర్ తుకారాం rathod ,ఎం సి ఎచ్ ఆఫీసర్ డాక్టర్ అంజనా మేడం ,రోటరీ చైర్మన్ జ్ఞానప్రకాష్ ,డి డబ్ల్యూ ఝాన్సీ లక్ష్మి ,ఏవో గంగాధర్, సూపర్వైజర్ రవి గౌడ్ ,డి పి ఓ విశాల అగస్టీన్ ,Dhe వెంకటేశ్వర్లు , rathod పాల్గొన్నారు .ఇంకా ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది వివిధ నర్సింగ్ కళాశాల ల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment