*"వినాశనకర విదేశీ కంపెనీ గో బ్యాక్"*


*వినాశనకర విదేశీ కంపెనీ గో బ్యాక్*
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
"అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్ పేపర్ & మీడియా ఛానెల్"

విదేశీ సౌదీ అరేబియా దేశానికి చెందిన "హరమ్ కో" రిఫాయనరి కంపెనీ మహారాష్ట్ర లోని కొంకన్ ప్రాంతంలోని నానర్ లో ఏర్పాటు చేయాలని పన్నాగం పన్నినప్పుడు గత పలు సంవత్సరాల క్రితం అక్కడి ప్రజలు పోరాటాలు నిర్వహించి విజయం సాధించారు. అనంతరం బార్సు సొలగావ్ పంచక్రోశి గ్రామాల్లో అదే కంపెనీ ఇండియా కంపెనీలతో కోలాబిరేషన్ చేసుకొని రానున్నట్లు తెల్సింది. అట్టి ప్రాజెక్టును స్థానిక గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్టి కంపెనీ ద్వారా స్థానిక ప్రజల విశాల సాగు భూమి, మంచి నీళ్ళు, జీవరాసులపై, చివరికి పర్యావరణం పై తీవ్ర స్థాయిలో దుష్పరిణామాలు చోటు చేసుకునున్నాయి. ఇంతే గాకుండా ఈకళోజికల్ ఇంబేలియన్స్ ఏర్పడనున్నట్లు రిఫాయనరి విరోధి సంఘటన వెల్లడించింది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే నుంచి గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు మాట తప్పినందుకు ప్రజా ఆగ్రహాన్ని వ్యక్తపర్చడానికి మంగళవారం రోజంతా ముంబైలోని ఆజాద్ మైదానంలో (సెక్రెటరియట్) వద్ద భారీ నిరసన సభను చేపట్టారు. తమ ప్రియతమ కొంకన్ ప్రాంతాన్ని నాశనం కానివ్వం. రాజాపూర్ తాలూకా లోని ఎటువంటి మానవ హానికర ప్రాజెక్టు ఏర్పాటు కాకుండా ప్రకటించాలని రాష్ట్ర సర్కార్ ను ఖరాఖండిగా డిమాండ్ చేశారు.  లేదా రాబోయే ఎన్నికల్లో జనవ్యతిరేక పార్టీలకు బుద్ది నేర్పక తప్పదని "సంఘటన" కు చెందిన అధ్యక్షులు వైభవ్ కొల్వంకర్, ప్రధాన కార్యదర్శి నరేంద్ర జోషి, కోశాధికారి కిషన్ బానే లు ఈ భారీసభ ముఖాన హెచ్చరించారు. 
ఈ నిరసనలో అత్యధిక మోతాదులో మహిళలు యువకులు పాల్గొనడం విశేషం. ప్రకృతి వినాశకర కంపెనీ గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలతో మైదానమంతా మారుమోగింది.

నేటి నిఘా న్యూస్ మీడియా
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
"అవినీతి అక్రమాల పై నిఘా"
ఎడిటర్
 కట్టా నరేశ్ కుమార్ నాయక్
 జర్నలిస్ట్ 7097988840.


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026