మహాడ్ సాక్షిగా నీళ్ల కోసం మరో పోరాటం అవసరం*"నేటి నిఘా న్యూస్ మీడియా"


*మహాడ్ సాక్షిగా నీళ్ల కోసం మరో పోరాటం అవసరం*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ "మంచి నీళ్ల కోసం" మహారాష్ట్ర జిల్లా రాయ్గడ్ లోని మహాడ్ చెరువు వద్ద 20 మార్చి 1927 న ఉద్యమించిన ఐతిహాసిక రోజు. ప్రత్యేక్షంగా ఆదివారం ముంబై నుంచి అంబేడ్కరైట్ గాయకులు భీంరత్న మాలజీ అదే స్థలంలో అట్టి పోరాటాన్ని స్మరిస్తూ పాటలు పాడారు. ఆనాడు మనువాదులు ప్రకృతి నీళ్లను మానవ జాతి కోసం బందిస్తే, నేడు మరో పద్ధతిలో బిస్లేరి - కిన్లీ విదేశీ కంపెనీలు బ్యాటల్లో మన నైసర్గిక నీళ్లను బందీ చేశారని, మన నీళ్లనే మనకు అమ్మి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఇంతేగాకుండా దేశంలోని మన సజీవ నదులను ఎండమావులుగా మార్చి, ఇకలోజికల్ ఇంబ్యాలెన్సు సృష్టిస్తూ వాతావరణాన్ని విపరీతంగా ద్వంసం చేస్తున్నారని తన పాటల ద్వారా దుయ్యబట్టారు. ఆనాటి అంబేడ్కర్ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని నేడు భారతీయులు ఉవ్వెత్తున ఉద్యమించాలని వాగ్గేయులు భీంరత్న ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 
మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత లోక్ కళాకారుడు వసంత్ కెరుబాతడే, షాహిర్ విజయ్ గరుడ్ లు కూడా తన గళంతో ప్రజల్ని చైతన్య పర్చారు. ఇందులో సత్యశోదక ఓబీసీ పరిషత్ ముంబై అధ్యక్షులు ఉల్లాస్ రాథోడ్, గౌతం సదాపులే, బాబన్ మోరే, గంగారాం ఎం. పేడ్నేకర్, కె. శాంతారం కాంబ్లే, మోహిని అన్వికర్, షాలిని జాధవ్, సరితా జాధవ్, సూర్యకాంత్ కరాత్, దాసరి కృష్ణమూర్తి, మూల్ నివాసి మాలజీ ల తదితర్ల నినాదాలతో మహాడ్ చెరువుంతా మార్మోగింది.
నేటి నిఘా న్యూస్ మీడియా

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026