"ఇంట్లో పనులు చేసే మహిళల కి న్యాయం చేయాలని డిమాండ్"
*ఇంట్లో పని చేసే మహిళలకి న్యాయం చేయండి*
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లక్షల సంఖ్యలో గరీబు మహిళలు బలసినోళ్ళ బంగ్లాలల్లో తమ విధిని నిర్వహిస్తుంటారు. ఇందులో మన తెలంగాణ మహిళలు కూడా ఉన్నారు. ఇండ్లల్లో పని చేసే వారిని మరాఠీ భాషలో "మొలకర్ణి" అని అంటారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో "మహారాష్ట్ర రాజ్య గరెలు కంగార్ సమన్వయ సమితి" ఆధ్వర్యంలో మార్చి 8న ముంబైలోని ఆజాద్ మైదానం (సెక్రెటరియట్) వద్ద మహిళా మొలకర్ణిలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిత్యం పెరుగుతున్న ధరల తరుణంలో చాలిచాలని జీతాలు ఉన్నాయని, తమకు ఎలాంటి రక్షణ లేదని, రాష్ట్ర సర్కార్ తమకు ఐడికార్డులు, జీవిత ఇన్సూరెన్స్ ను, అన్ని రకాల కార్మిక సౌకర్యాలు కల్పించాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ జీవితాల్లో సమాన మార్పు, గౌరవం దక్కినప్పుడే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని కంగార్ ఏక్తా యూనియన్, "మహామాయ అసంఘటిత్ కంగార్ సంఘటన" కు చెందిన అధ్యక్షురాలు మీనా సప్కాల్ గారు పేర్కొన్నారు. "సమితి" నేతలు కామ్రేడ్ ఉదయ్ భట్, జ్ఞనేశ్ పాటిల్, రాజు వంజారే లతోపాటు "సంఘటన" కార్యకర్తలైన సీత ఖండ్గాలే, శోభ బాలేరావు, శోభ శీర్వాలే, సవితా గైక్వాడ్, మంద పాజ్గె, సి.శోభ, రాజవ్వ, ఎం. లక్మి అక్క తదితర్లు భారీ సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
*నేటి 👁️నిఘా 🔎న్యూస్ 📰మీడియా💢*
"అవినీతి అక్రమాల పై నిఘా"
*నేటి నిఘా ఈ న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా*
ఎడిటర్ కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.7097988840.
సేకరణ న్యూస్ లైన్.
(బొంబాయి మీడియా ప్రతినిధి)
ఎం. మాలజీ : 9869010890
Comments
Post a Comment