"అసెంబ్లీ లో జర్నలిస్టుల సమస్యల పై సీతక్క"

  *"జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే సీతక్క?"*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
(న్యూస్ లైన్ ✍️ప్రతినిధి)

*జర్నలిస్టుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడలేని ప్రజాప్రతినిధులు జర సిగ్గు పడండి*

*మీ ప్రచారానికి మీ పొగడ్తలకు జర్నలిస్టులు కావాలి, కానీ వాళ్ల సమస్యలు మీకు అవసరం లేదు*

*టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో నాశనమైన జర్నలిస్టుల బతుకులు*

*అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన టిఆర్ఎస్ ప్రభుత్వం*

*జర్నలిస్టుల సమస్యలను ప్రశ్నించలేని ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను ఏం ప్రశ్నిస్తాయి*

హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సీతక్క కు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నంచిన్ని వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జర్నలిస్టుల బతుకులు పూర్తిగా నాశనం చేశారని వారికి కావాల్సిన హక్కులు ఎక్కడ ఇవ్వడం లేదన్నారు. వాస్తవాలు రాసే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు వేరే వృత్తులలో తమ జీవితాన్ని కొనసాగించడంతో అనేక అవినీతి అక్రమాలు బయటకు రావడం లేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైందన్నారు. అధికారులు లంచాలు ఇస్తే తప్ప విధులు నిర్వహించడం లేదని దీనిపై ఎన్ని కథనాలు రాసిన సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయంకు, కేటీఆర్ కు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన బహిరంగంగా ట్విట్టర్ చేసిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా భూకబ్జాలు అవినీతి అక్రమాలే కనిపిస్తున్నాయని వీటిని వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం వల్ల అవినీతి అక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న సంకేతాలు ప్రజలలో వెళ్తున్నాయన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఏవైనా ఎన్నికలు వస్తేనే జర్నలిస్టు గుర్తుకు వస్తారని లేకుంటే వాళ్లని జైలుకు పంపించడం గుర్తుకు వస్తుందని అందుకోసమే తెలంగాణలో జర్నలిస్టులకు ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు కూడా జారీ చేయలేదని హెల్త్ కార్డుల మాట మాట్లాడుకోవడం సిగ్గుచేటన్నారు. చిన్న పత్రికలను పూర్తిగా నాశనం చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికె చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల నుండి అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని గతంలో ఇచ్చిన అక్రిడేషన్ కార్డు లో భారీగా అవినీతి జరిగిందని ఒక్కొక్క కార్డులు 30 నుండి 50 వేల వరకు పత్రికా యాజమాన్యాలు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టుల కోసమా.? లేక యజమాన్యం అమ్ముకోవడం కోసమా.? తెలపాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ పెట్టడం తప్ప దానిని ఇచ్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఏమాత్రం లేదని తెలంగాణలో ఉన్న అందరి జర్నలిస్టులకు తెలుసు కాబట్టి ఈ విషయంపై మాట్లాడడం వృధా అన్నారు. ఇప్పటికైన తెలంగాణ జర్నలిస్టులు ఆలోచించి జర్నలిస్టులకు న్యాయం చేసే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా వర్ని సీనియర్ విలేకరి శానం సాయిలు గ్రామము రుద్రూర్ 

మండలం  ఆంభం ఆర్ గ్రామ వాస్తవ్యులు,,
తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలంటూ వర్ని మండల కేంద్రంలోని టవర్ ఎక్కిన వైనం పలువురికి ఆశ్చర్యానికి గురి చేసింది,,,
సుమారు 30 ఏళ్లకు పైగా సీనియర్ విలేకరిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు తమ సమస్యలు పరిష్కరించాలంటూ టవర్ ఎక్కాల్సిన దుస్థితి బాన్స్వాడ నియోజకవర్గంలో రావడం దారుణమని పలువురు  భావిస్తున్నారు,,
వర్ని ఉమ్మడి మండలాల్లో సీనియర్ విలేకరులపై ఈ విధమైన వేధింపులు అవసరమా? కోటగిరి మండలం లో కొంతమంది విలేకరులు పై తప్పుడు కేసులు బనాయించడం.
రుద్రూర్ ఉమ్మడి మండలంలో కొంతమంది  సీనియర్ విలేకరులపై తప్పుడు కేసులు ,,,రౌడీషీట్ కేసులు చేయటం
ఇలాంటి ఉదంతాలు ఉమ్మడి మండల లో జరగటం ఎంతవరకు సమంజసమని
దీనికంతటికీ కారకులెవరు? ఎందుకు సీనియర్ విలేకరులపై ఈ పరిస్థితి జరుగుతుంది, ఇంకెన్నాళ్లు సీనియర్ విలేకర్ల పట్ల ఈ దుస్థితి,,,,
వర్ని ఉమ్మడి మండలంలో ఇల్లు, ఇళ్ళ స్థలాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు రిపోర్టర్లు,,,,
సుమారు 40 సంవత్సరాల నుంచి పాలకులు మారుతున్న ప్రభుత్వం మారుతున్న విలేకరులకు ఇళ్ల స్థలాలు సంక్షేమ పథకాలు వర్తింపచేయడం లో పూర్తి నిర్లక్ష్యం ఎందుకు?
సీనియర్ జర్నలిస్టుల పట్ల జూనియర్ జర్నలిస్టుల పట్ల కనికరం ఉండదా?
ఈ సమస్యలు ఒక ఎత్తయితే,,,
విలేకర్ల సొంత సమస్యల పట్ల కూడా వేధింపులు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు చర్చించుకుంటున్నారు,,,,
ఏది ఏమైనా బాన్స్వాడ నియోజకవర్గంలో వర్ని ఉమ్మడి మండలాలలో విలేకరులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు ( భావిస్తున్నారు)
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎన్ని సార్లు దరఖాస్తులు ఇచ్చిన పిరియ్యాధులు చేసిన బాధితులు కు న్యాయం కోసం పోరాడుతున్న వారికి ఈఓక్క నాయకులు స్పందించకుండా  నిర్లక్ష్యం చేస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజల కోరుతున్నారు ప్రతిక్షణం ప్రజల కోసం ప్రత్యక్షంగా,పరోక్షంగా పోరాడే సామాజిక  దృక్పథం కలిగిన ఈ జర్నలిస్టులు నిజాల్ని రాస్తూ అవినీతి అక్రమాల పై నిఘా వేసి సమాచార న్ని ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా సారధిగా పని చేస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత గా భావితరలకు   ఆదర్శంగా నిలిచే అక్షర సమరం సాగించి అలుపెరగని పరుగులో  ప్రతిక్షణం ప్రజాహితం కోసం పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ప్రతి  సమస్యకి పరిష్కారం చేసే దిశగా మార్పు కోసం నిరంతరం  పోరాడుతున్న జర్నలిస్టుల కు ధన్యవాదలు ఇకనైన పాత్రికేయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటారని ఆశిషుస్తు అందరి మేలు కోరే మీడియా మిత్రుల కు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంద అని రాస్తూ పాత్రికేయుల ను పరిరక్షించే బాధ్యత కై ఎదురు చూస్తున్న ఎందరో జర్నలిస్టులు అక్రమ కేసుల్లో ఇరికించి కుట్రలు చేస్తూ అవినీతి అక్రమాల పై ఇంకా గట్టిగా పోరాడే ప్రతి జర్నలిస్టు ఏకమైన రోజే మార్పుకు స్వీకారం కనుంద మరో పోరాటం చేయడానికి ముందుకు వస్తున్న ఈ జర్నలిస్టుల సంఘాల నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి చూస్తే అర్థమవుతుంది మీడియా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు పాత్రికేయ సంఘాల  పోరాటాల తో మరో సారి తెలంగాణ మరుమోగనుంద.

"నేటి 👁️నిఘా 🔎న్యూస్ మీడియా"
✍️ఎడిటర్ 
కట్టా నరేశ్ కుమార్ నాయక్
నేటి నిఘా న్యూస్
సెల్ 7097988840.
 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026