"మై ఆటో సేఫ్ డ్రైవ్ ప్రోగ్రామ్" నేటి నిఘా న్యూస్
"మై ఆటో సేఫ్ డ్రైవ్ ఇన్ ప్రోగ్రామ్"
నేటి నిఘా న్యూస్
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్
ఆటో లో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ కోసం "మై ఆటో ఇన్ సేఫ్" కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్
నేడు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో" మై ఆటో ఇన్ సేఫ్" కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు, ఐ.పి.ఎస్., గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ 2019 నుండి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే ప్రారంభించబడి విజయవంతంగా అమలు చేస్తున్న "మై ఆటో ఇన్ సేఫ్" కార్యక్రమమును మన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ.ఆర్. ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "మై ఆటో ఇన్ సేప్" కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ శ్రీ. కె.ఆర్.నాగరాజు, ఐ.పి.ఎస్.,గారు ఘనంగా ప్రారంభించడం జరిగింది. సులబ మరియు సురక్షితమైన రవాణా విధానం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 8000 ఆటో రిక్షాలు మరియు 500 క్యాబ్ లు రవాణాలో ప్రయాణికులకు మరింత భద్రత మరియు సౌకర్యాన్ని అందించడానికి ప్రయాణికుల సమస్యలను పర్యవేక్షించడానికి ఆటో మేనేజ్మెంట్ యాజమాన్యం RTA వారి నియమాలను పాటించడం లేదు.
పోలీస్ సిబ్బంది ప్రతి ఆటో డ్రైవర్ ను సోదరభావంతో చూడాలని, ఆటో డ్రైవర్ కు ప్రయాణికుల దేవుళ్లు అని వారి సౌకర్యార్థం చక్కని విధులు నిర్వహించాలని, అట్టి ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చాలని, ప్రతీ ఆటో డ్రైవర్ పోలీస్ యూనిఫాం లేని పోలీస్ అని, ఈ మధ్యనే ఒక కేసులో ఆటో డ్రైవర్ ఉన్నాడని, కావున ఆటో డ్రైవర్ మంచి క్రమశిక్షణ తో ఉండాలని ,ప్రతి ఒక్క ఆటోడ్రైవర్ మంచి ఫలితంతో ఇంటికి వెళ్లాలని ,ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ "మై ఆటో ఇన్ సేఫ్" నిబంధనలు పాటించాలని ,మీ రక్షణ కోసం ఏర్పాటు చేశామని దీనికి ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్ ఉండడం వలన ఎవ్వరు ఎలాంటి నేరాలు చేయ కుండా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యానికి చేరుతాను అని నమ్మకం కలుగుతుందని తెలియజేశారు. ఎవ్వరు కూడా గంజాయి అలవాట్లు చేసుకోరాదని, గంజాయి తో సంబంధాలు పెట్టుకోవద్దని, నేరస్తులకు సహకారం అందించ వద్దని,
"మై ఆటో ఇన్ సేఫ్" ఏ విధంగా ఉపయోగపడును:
ఆటో రిక్షాలు మరియు క్యాబ్ సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు మరియు సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారంను ప్రతి ఆటో రిక్షా మరియు క్యాబ్ లకు బోర్డులు మరియు స్టిక్కర్లు జారీ చేయడం జరుగుతుంది. ప్రతి వాహనానికి "డ్రైవర్ సీట్ వెనుక భాగంలో ల్యామీనేటెడ్ బోర్డు , ఫ్రంట్ మిర్రర్ స్టిక్కర్, వాహనానికి వెనుక భాగంలో స్టిక్కర్స్" అంటించడం జరుగుతుంది .
ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇట్టి స్టిక్కర్లు ట్రాఫిక్ సి.సి కెమెరాల నిఘా ద్వారా కేసు దర్యాప్తులో సహాయపడతాయి.
ప్రయాణికులు సురక్షితంగా ఎలా భావిస్తారు:
# ఆటో ప్యాసింజర్ లోకి అడుగు పెట్టే ముందు ఫ్రెంట్ స్టిక్కర్ ను వెరిఫై చేయండి ,ఇక్కడ ప్రయాణికులు సౌకర్యవంతంగా ఆటో లోకి అడుగు పెట్టవచ్చు .
# ఆటో లో ప్రయాణిస్తున్నప్పుడు, బోర్డులో ముద్రించిన "క్యూ అర్ కోడ్"ను స్కాన్ చేయడం ద్వారా లేదా బొడ్డు యొక్క స్నాప్ తీసుకోవడం ద్వారా ప్రయాణికులు తమ మొబైల్లో ఆటో సమాచారాన్ని సేవ్ చేయవచ్చు లేదా పంచుకోవచ్చు.
# క్యూ అర్ కోడ్ నీ స్కాన్ చేసినప్పుడు డ్రైవర్ ఫోటోతో పాటు వాహన రిజిస్ట్రేషన్ స్థితిని వీక్షించగలరు.
వారు ఆసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని ,సంఘటనలను అన్ని వేళలో వెంటనే నివేదించ వచ్చు.
ఆటో యజమానులు ఎలా ప్రయోజనం పొందుతారు:
# ఇది ప్రయాణికులకు ఏ సమయంలో నైనా ఆటోలలో ప్రయాణించి విశ్వాసాన్ని ఇస్తుంది.
# రాత్రి సమయాలలో పనిచేస్తున్నప్పుడు, చెక్ పోస్ట్ లు/ ట్రాఫిక్ పోలీసులు తో సులభంగా కమ్యూనికేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది.
# ఏదైనా డ్రైవర్ ఆటోలను దుర్వినియోగం చేస్తే, ఆటో యజమాని సులభంగా సమాచారాన్ని కనుక్కోవచ్చు.
# ఇతర జిల్లాల వాహనాలను నియంత్రించవచ్చు.
# ప్రయాణికుల సమీక్షల ఆధారంగా మేము డ్రైవర్లను ప్రశంసలు మరియు అవార్డులు ఇస్తున్నాము. ఇది సమాజంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని నిర్మిస్తుంది.
పోలీస్ శాఖ పరిధి -నేరాల నివారణ:
# పోలీస్ సిబ్బంది ప్రజల రవాణా సమయంలో కలిగే అతి చిన్న సమస్యలను కూడా సులభంగా స్వీకరిస్తారు. మరియు నేరాలను నివారించడానికి నివారణ చర్యలుగా అవసరమైన చర్యలు తీసుకుంటారు .
# కేంద్రీకృతమైన కచ్చితమైన ఆటోల, యాజమాన్యాల సమాచారం పోలీస్ కేసుల విచారణలో సహాయం చేస్తుంది.
# ఆటో డ్రైవర్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా వారిని చైతన్య పరిచవచ్చు.
# ట్రాఫిక్ జాము లు, అలర్ట్ లు, ప్రమాదాలు మరియు అవగాహన కార్యక్రమాల వివరాలు వంటి ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా కమ్యూనికేట్ చేయవచ్చు.
అనంతరం ఆటోలకు క్యూఆర్ కోడ్ తో ఏర్పాటుచేసిన స్టిక్కర్లను ఆటో ముందు భాగంలో, ఆటో డ్రైవర్ సీటు వెనుక భాగంలో ,ఆటో వెనక టాప్ మీద ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం ద్వారా పాటల రూపంలో జరిగే ప్రయోజనాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి.అరవింద్ బాబు, అదనపు డిసిపి (లా అండ్ ఆర్డర్) శ్రీ డాక్టర్ll వినీత్. జి, అదనపు డిసిపి (అడ్మిన్) ఉషా విశ్వనాథ్ తిరునగరి , అదనపు డిసిపి ( ఏ.ఆర్) శ్రీ గిరిరాజు, తింక్ మ్యాక్స్ (సీ.ఈ.ఓ) శ్రీ రమేష్ రెడ్డి, ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ సీ.ఐ శ్రీ చందర్ రాథోడ్, ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీ శంకర్, మరియు ట్రాఫిక్ సిబ్బంది ,ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు పాల్గొనడం జరిగింది.
"నేటి నిఘా న్యూస్ మీడియా"
ఎడిటర్ కట్టా నరేశ్ కుమార్ నాయక్
7097988840
Comments
Post a Comment