*మెగా జాబ్ మేళా*

"మెగా జాబ్ మేళా"
"నేటి నిఘా న్యూస్ మీడియా"
*అవినీతి అక్రమాల పై నిఘా*

 *మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు*

రైల్వే కోడూర్ మార్చి 19 రిపోర్టర్ పులి వెంకటేష్

 ఈరోజు ఉదయం రైల్వే కోడూరు పట్టణం ప్రభుత్వ జూనియర్  కాలేజ్ నందు రేపు జరగబోయే మెగా జాబ్ మేళా గురించి వాలంటీర్లకు సూచనలు చేసి, ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, ఎంపీ గారి ఓఎస్డి దుర్గాప్రసాద్, జడ్పిటిసి రత్నమ్మ,మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

 రైల్వేకోడూరులో మెగా జాబ్ మేళాను నిర్వహించిన స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వేలసంఖ్యలో హాజరై ఉద్యోగాలు పొందిన యువతీ యువకులు మెగా జాబ్ మేళాను ఉద్దేశించి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.*

:రైల్వే కోడూర్ మార్చి 19 రిపోర్టర్ పులి వెంకటేష్: 


వివరాల్లోకెళ్తే కడపజిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి స్థానిక నాయకులు కలిసి యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమెగా జాబ్ మేళాలో యువతీ యువకులు వేల సంఖ్యలో ఉద్యోగాలు అవకాశాలు పొందేటట్లు ఏర్పాటు చేశారు. మెగా జాబ్ మేళా నిర్వహించి స్థానికులు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈకార్యక్రమంలో పాల్గొని, అర్హతగల వారికి నియామక పత్రాలను పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఏపీఎస్ ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమానికి అతిథులుగా వై ఎస్ ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్ రెడ్డి, వైస్ఎంపీపీ ధ్వజారెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, ఓఎస్డి దుర్గాప్రసాద్, ఎంపీపీ సింగనమల భవాని, జడ్పిటిసి రత్నమ్మ, ఎంపీపీ విజయ్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట శివ సాయి, అధిక సంఖ్యలో  నిరుద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానికులు అందరికీ మండల వైస్ఎంపీపీ ద్వజారెడ్డి ఆధ్వర్యంలో మరియు పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భోజన సదుపాయాలతోసహా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026