"గజిటెడ్ఆఫీసర్ సంతకం ఫోర్జరీ"
"సిర్పూర్ టి స్టేట్ బ్యాంక్ లోని ఆధార్ కేంద్రం లో అక్రమాలు, గజిటెడ్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి సవరణలు చేస్తున్నా నిర్వాహకుడి పై కేసు నమోదు"
నేటి నిఘా న్యూస్ మీడియా
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం లోని సిర్పూర్ టి మండలం లో ఉన్న స్టేట్ బ్యాంక్ లోని ఆధార్ సెంటర్ నిర్వాహకుడు సిరంగి రాజేందర్ పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ టి ఎస్ ఐ ఎం. రవి కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆధార్ కార్డు లోను తప్పొప్పులను సరి చేయడం పేర్లు చిరునామా పుట్టిన తేదీ మార్పులు చేర్పుల కోసం ఏర్పాటు చేయగా దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది అక్రమార్కులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్ కోసం అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాల పై గెజిటెడ్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ స్టాంపులు సృష్టిస్తూ వాటికోసం అన్ని తానై ప్రభుత్వాన్ని మోసగించి లబ్ధిదారుల నుంచి రూపాలు 2 వేల నుండి 3 వేల వరకు దండుకుని పలువురికి పేరు నమోదు తోపాటు పుట్టిన తేదీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సిర్పూర్ టి ఎస్బిఐ బ్యాంకులో ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకుడి పై గత కొంత కాలం నుండి ఇలాంటి అక్రమాలు లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన తరుణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితుడు సిర్పూర్ టి ఎస్బిఐ బ్యాంకులో ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకుడు సిరంగి రాజేందర్ పై కేసు నమోదు చేశారు దీని వెనుక ఎవరున్నారు విచారణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. గతంలోనూ కూడా సరిహద్దులోని మహారాష్ట్ర వాసులు సిర్పూర్ టి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న బంధువుల దగ్గర వారి ఇళ్లలో తాత్కాలిక నివాసం ఉంటూ ఈ ఆధార్ కేంద్రం ద్వారా ఆధార్ కార్డులు పొంది నట్లు ఆరోపణలు ఉన్నాయి తప్పుడు దృవీకరణ పత్రాలతో కళ్యాణ లక్ష్మి వంటి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకొని అడ్డదారుల్లో ప్రభుత్వ సొమ్మును లబ్ధి పొందినట్లు సమాచారం సిర్పూర్ టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోని ఉన్న ఆధార్ కేంద్ర నిర్వాహకుడి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ కాగజ్ నగర్ మండలం నజ్రరుల్ నగర్ మరియు కొమురం భీం జిల్లా ఆదార్ కేంద్రాలపై ఇంటెలిజెన్స్ పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
నేటి నిఘా న్యూస్ మీడియా.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి నేటి నిఘా తెలుగు దినపత్రిక ప్రతినిధి మహమ్మద్ కబీర్ అహ్మద్.
Comments
Post a Comment