"అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు"

"తెలంగాణలో మహిళలకు పెద్ద పీట"

-కేసీఆర్ లాంటి దమ్మున్న సీఎం లేరు

-మహిళా పథకాల గురించి చెబితే రామాయణం.. వింటే భారతం

-స్త్రీలు పురుషులను మించిపోయేలా కదం తొక్కాలి
 *-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి* 

-విశిష్ట మహిళలకు సత్కారం.. చీరెల కానుకలు

ఆర్మూర్, మర్చి8:-
మహిళలకు పెద్దపీట వేసి సమున్నతంగా గౌరవించుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి.. 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని ఎమ్.ఆర్ గార్డెన్స్ లో మంగళవారం జీవన్ రెడ్డి సారధ్యంలో మహిళా సంబురాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మహిళల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాల మధ్య పారిశుద్ధ్య కార్మికులు, అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్లు, ఏ ఎన్ ఎమ్ లు, నర్సులు, ఆర్ పీ, డాక్టర్లు, ఇంకా వివిధ రంగాలకు చెందిన మహిళలను  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి కానుకగా చీరెలను పంపిణీ చేశారు. వేల సంఖ్యలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. "లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. 
స్త్రీ లేకపోతే గమనం లేదు. 
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. 
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. 
మరి.. మనల్ని కంటిపాపలా కాపాడే 'స్త్రీమూర్తి'ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత" అని పేర్కొన్నారు. మనమేదైన గొప్ప పని చేస్తే హీరోలు అని అంటారు. అలాంటి మన విజయం వెనుక స్త్రీ శక్తి లేకుంటే జీరోలమవుతాం అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధు అని, ఆయన లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి దేశం లోనే లేరని, తెలంగాణ మాదిరిగా మహిళలను గౌరవించుకునే రాష్ట్రం ఎక్కడాలేదని జీవన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ దయతో ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి వచ్చిందని, 30వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడాలంటే చెబితే రామాయణమంత..వింటే భరతమాత అని వ్యాఖ్యానించారు.
మహిళలకు అన్ని దశల్లో  అన్న లా, మేనమామ లా,తాత లా అండగా నిలుస్తున్న కేసీఆర్ దార్శనికుడైన పాలకుడన్నారు.  కేసిఆర్ కిట్ అంటే ప్రసవ సమయంలో ఇచ్చి చేతులు దులుపుకునేది కాదన్నారు. తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు,పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమల తెర వంటి వాటితో శిశు రక్షణకు ఇస్తున్నదే  కేసీఆర్ కిట్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 6 నెలల గర్భవతి నుంచి 3 నెలల బాలింత వరకు ఆమెకు ఆర్దికంగా అండగా ఉండేందుకు 12 వేల రూపాయలు ఇస్తూ, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలతో పాటు ఇస్తున్న ప్రభుత్వ మిదన్నారు. దీనివల్ల 10 లక్షల మంది మహిళలు లబ్ది పొందారన్నారు.
ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతిరోజు 5 లక్షల మంది మహిళలు భోజనం చేస్తున్నారని,
వీరితో పాటు 17 లక్షల మంది పిల్లలు కూడా ప్రతి రోజూ భోజనం తింటున్నారని  జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
"ప్రభుత్వ దవాఖనాలలో 32 శాతం ఉన్న ప్రసవాలు 52 శాతానికి పెంచి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం ఇది.
అంగన్ వాడిలు గర్భిణీల  ప్రసవ తేదీలుగుర్తుంచుకుని వారి యోగ క్షేమాలు చూడాలని సీఎం కేసిఆర్  ఆదేశించారు.ఇవన్నీ పథకాల ద్వారా మాతా మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయని జీవన్ రెడ్డి అన్నారు. చైతన్య మూర్తులైన మహిళా మా తల్లులు పురుషులను మించిపోయే ప్రతిభాశాలులు గా కదం తొక్కాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026