"నాయకులకే దళిత బందు పై పిరియ్యదు"!
'దళిత బందు కాదిది దళితుల మధ్య చిచ్చు పెట్టే బందు"
నేటి నిఘా న్యూస్ మీడియ
(మార్చ్ 2022)
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి
"అర్హులు అందరికి ఇవ్వాలని డిమాండ్"
తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి
"నిఘా న్యూస్ మీడియా"
దళిత బందు కాదిది దళితుల మధ్య చిచ్చు పెట్టే బందు"
@బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సిర్పూర్ టి తహసీల్దార్ కార్యాలయం ముందు అర్హులైన నిరుపేద దళితులతో ధర్నా నిర్వహించిన బి. ఎస్. పి. నాయకుడు దుర్గం ప్రవీణ్@
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం లోని సిర్పూర్ టి మండల తాసిల్దార్ కార్యాలయం ముందు అర్హులైన నిరుపేదల దళితులు, మహిళ దళితులతో ధర్నా నిర్వహించి వారు మాట్లాడుతూ సిర్పూర్ టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి లీడర్లకు, కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు మంజూరు చేస్తూ దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని చిచ్చుపెట్టే ఎమ్మెల్యే కోనప్ప ను దళితులు సహించే ప్రసక్తి లేదని తెలిపారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోనప్ప పై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఈరోజు దళిత మహిళలు మండిపడుతున్నరని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా దళిత బందు అంటూ దళితుల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల లీడర్లకు వాళ్ళ కార్యకర్తలకు దళిత బందును ఇచ్చి మిగతా దళితులకు ఇవ్వకుండా కుట్రపూరితంగా హేళన చేస్తున్నారు. దళిత బందులో కమిషన్ ఇస్తేనే మిగతా దళితులకు దళిత బందు అంటూ ఏకంగా ఎమ్మెల్యేలు అనడం సిగ్గుచేటని తెలిపారు. కడు పేదరికంలో ఉన్న ఇండ్లు లేని వారు, ఆడ పిల్లలు ఉన్నవారు, భూమి లేకుండా ఎన్నో వేలమంది దళితులు ఉన్నా ఇలాంటి నిరుపేద దళితులు ఉపాధి కరువై జీవితం భారమై కుటుంబాలను పోషించుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి అర్హులైన నిరుపేదల దళితులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు కనబడడం లేదా అంటూ మండిపడ్డారు. సిర్పూర్ టి నియోజకవర్గంలో అర్హులైన దళితులు అందరికీ దళిత బంధు మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోని వారికి న్యాయం చేయాలని లేనిపక్షంలో నియోజకవర్గంలోని దళితుల అందరిని ఏకం చేసి వారి పక్షాన ఎమ్మెల్యే, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పాలన అధికారులు స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరికీ దళిత బంధు పథకాన్ని ఇవ్వాలని తెలిపారు.
"నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్"
అవినీతి అక్రమాల పై నిఘా
NEWS NTNS
ఎడిటర్
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్ 7097988840.
యడ్స్ & న్యూస్ కోసం సంప్రదించండి
Comments
Post a Comment