"పదవ తరగతి పరీక్షల కోసం సిద్ధం కావాలి"

 *10వ తరగతి పరీక్షల సన్నద్ధత కోసం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం* 
"నేటి నిఘా న్యూస్ మీడియా"
:రైల్వేకోడూరు మార్చ్ 2022.
 నిఘా న్యూస్ రిపోర్టర్ పులి వెంకటేష్:


 కడప జిల్లా రైల్వే కోడూరు స్థానిక విక్టరీ హైస్కూల్ నందు 10వ తరగతి పరీక్షల సన్నద్ధత కోసం విక్టరీ విద్యాసంస్థల అధినేతలు విక్టరీ రామకృష్ణారెడ్డి, విక్టరీ నరసింహారెడ్డి  ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ SN శ్రీనివాసులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు పోకల సుబ్బారెడ్డి, తిరుపతి శ్రీధర్ అకాడమీ శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. 10వ తరగతి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చదివితే మంచి ఉత్తీర్ణత సాధించగలరో వివరించారు.
  ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను  మెమెంటో శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026