"సావిత్రి బాయ్ పూలే స్మృతి కార్యక్రమం"
"థానే లో తొలిసారి"
*సావిత్రిబాయి ఫూలే స్మృతి కార్యక్రమం*
"నేటి నిఘా ఈ న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా"
(నేటి నిఘా న్యూస్ లైన్ ✍️ ప్రతినిధి)
ముంబై మహానగరాన్ని అంటుకొని ఉన్న జిల్లా థానే పట్టణంలో తెలంగాణ వలసజీవులు మంచి మోతాదులో ఉన్నారు. ఉమ్మడి మెహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గం వారు గత నలభై వసంతాల పాటుగా బసై ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం థానే లోని ఇందిరా నగర్ నందు "హనుమాన్ తెలుగు సేవ మండల్" ఆధ్వర్యంలో విద్యావేత్త సావిత్రమాయి ఫూలే 126 వ. వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆరంభంలో ఆమె చిత్రపటానికి నక్క నర్సింగమ్మ, కుమ్మరి శంకరమ్మ, లక్ష్మీ మహిళలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రముఖ మార్గదర్శకులుగా విచ్చేసిన "డాక్టర్ ఆర్.ఎస్.పి అభిమాన బృందం" నేత నాగ్ సేన్ మాలజీ మాట్లాడుతూ మెహబూబ్నగర్ ముద్దుబిడ్డ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ త్వరలో ముంబై రాకకు తమరందరు సహకరించాలని సభ ముఖాన సవినయంగా కోరారు. అట్టి విజ్ఞప్తికి "మండల్" అధ్యక్షులు గోపీరెడ్డి బీమన్న, వారి సభ్యులందరు సానుకూలంగా స్పందించారు. మరో "బృందం" నేత ములుగు లింగం మాట్లాడుతూ మన మరాఠీ గడ్డపై పుట్టిన మహో పాద్యాయురాలు సావిత్రిమాయి జీవిత చరిత్రను, ఆమె గొప్ప త్యగాన్ని వివరించారు. ఇట్టి స్మృతి సమావేశంలో "మండల్" సభ్యులైన మెట్ల బాలస్వామి, నక్కా అంజయ్య, పోతరాజ్ శ్రీనివాస్, జుట్ల వెంకటేష్, జోగు బలరాం, పిల్లిగిరి చిన్న, జి.బాలక్రిష్ణ, బి.రవి, కానేపో కుమరయ్య, కె. కుర్మీయా, కె. సంజయ్, ఎస్. ఖాసిమ్, ఎన్. అరుణకుమార్, పి.రాములు, వై. గోవిందా, కె. రమేష్, ఏ. శ్రీనివాస్ చారి, ఎం.మాలజీ తదితర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment