"సమ్మె బాటలో CITU"

"కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలి CITU. రాష్ట్ర కార్యదర్శి R. త్రివేణి" 
"నేటి నిఘా న్యూస్"
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజక వర్గంలోని సిర్పూర్ కాగజ్నగర్ మండలంలో
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు  ఆఫీస్ లో  మార్చి  28.29 నా దేశవ్యాపిత   సార్వత్రిక సమ్మె సందర్భంగా  అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొంటారని సంబంధిత ప్రాజెక్ట్ అధికారి భాగ్యలక్ష్మి కి సమ్మె నోటీసు అందజేశారు. సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ త్రివేణి. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి అని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరిట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల లో విలీనం చేసి ఐ. సి. డి. ఎస్. ఉద్దేశాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం  2018 లో పెంచిన అంగన్వాడి వేతనం పదిహేను వందల రూపాయలు ఇప్పటి వరకూ చెల్లించలేదని గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కొంతమంది పదో తరగతి చదివి నా వాళ్ళు ఉన్నారు ఫోన్ అప్డేట్ చేయక ఇబ్బంది పడుతున్నారని దీనివల్ల రికార్డును రాయడంతో పాటు స్మార్ట్ ఫోన్ లో అప్లోడ్ చేయడం పని భారం పెంచడ  మే అని అన్నారు. వెంటనే స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈ నెల 28 /29 న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో అంగన్వాడి టీచర్లు' ఆశా వర్కర్లు' మధ్యాహ్న భోజనం కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్, అందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి  ముంజం.శ్రీనివాస్. ప్రాజెక్ట్ అధ్యక్షురాలు వై. అరుణ జిల్లా నాయకురాలు మాచర్ల .వినోద, గంగాభవాని, ఏ. పద్మజా, అరుణ ,శ్రీ లలిత కుమారి, సత్యమ్మ ,తదితర
 అంగన్వాడీ  టీచర్లు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నేటి నిఘా తెలుగు దినపత్రిక సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ మహమ్మద్ కబీర్ అహ్మద్.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026