భగత్ సింగ్ నివాళి SFI
*భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువత దేశంలో మతోన్మాదం, మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి.
నేటి నిఘా న్యూస్ మీడియా
SFI నిర్మల్ జిల్లా కార్యదర్శి అరవింద్
SFI నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి SC బాలుర హాస్టల్లో భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ 91వ వర్ధంతి భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా * జిల్లా కార్యదర్శి అరవింద్ మాట్లాడుతూ: దేశంలో కులం,మతం,ప్రాంతం, రంగు,వర్ణ,వివక్ష బేధం లేకుండా ఆనాడు దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత దేశ స్వతంత్రం,స్వయం పరిపాలన కోసం భగత్ సింగ్ చిన్న వయసులోనే ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనే నినాదంతో బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. నేటి యువత దేశంలో విద్య కాషాయీకరణకు, మహిళలపై అత్యాచారాలకు, దాడులకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం యువత పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో...
ప్రవీణ్ , సుసిల్, సాయి కృష్ణ , అశోక్, నితిన్ ప్రేమ్, మనోజ్, జగదీష్, రవితేజ
Comments
Post a Comment