ఫ్రీ కోచింగ్ సెంటర్ పై అవగహన
*"నేటి నిఘా న్యూస్ మీడియా"*
(న్యూస్ లైన్ ప్రతినిధి ఎప్రిల్ 2022)
*ఫ్రీ కోచింగ్ ను యువత సద్వినియోగం పరుచుకోవాలి, యువత లక్ష్యాన్ని చేరడానికి నిర్విరామంగా కష్టపడాలి : జిల్లా కలెక్టర్ వెల్లడి.*
పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఫ్రీ కోచింగ్ కు 1095 మంది అభ్యర్థులు ఉదయం 9:30 గంటలకు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ సీ. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్., మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు, ఐ.పీ.ఎస్.,గారి ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎత్తు చూడడం జరిగింది.అభ్యర్థుల SSC మార్కులు మెమో జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను వెరిఫికేషన్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చెయ్యనునందున యువత అట్టీ నోటిఫికేషన్కు అన్ని రకాలుగా సిద్దపడిఉండాలి అని, అందుకోసం మన నిజామాబాద్ జిల్లాలో యువత అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగస్తులు గా ఎంపిక కావాలని,పోలీస్ శాఖకు చెందిన పోస్టులు చాలా ఉన్నందున కానిస్టేబుల్ ,మరియు ఎస్సై, ఉద్యోగాలకు సన్నద్ధమవుతు, ఇతర గ్రూప్ పరీక్షలకు కూడా సిద్ధం కావచ్చు అని,DSC కి సపరేట్ ఉంటుంది, ఈ సబ్జెక్టు వలన అన్ని నోటిఫికేషన్స్ కు ప్రిపేర్ కావచ్చు అని, అందుకోసం పోలీసు శాఖ పరంగా ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లాలో ఎస్టీలకు 200, ఎస్సీలకు 300 , మైనార్టీలకు200 ,మంది ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇచ్చే మెటీరియల్ను ఉపయోగించుకోవాలని , యువతకు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం పరుచుకోవాలి అనీ, ఆరు నెలల లోపు దాదాపు 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ పూర్తి నియామకం చేయడం జరుగుతుంది. యువత చాలా కష్టపడి చదువవలెను. ప్రతి ఒక్కరు ప్రాపర్ గా ప్రిపేర్ అవుతానని ,ప్రతి ఈవెంట్లు కష్టపడి నేర్చుకుంటానని, నా సామర్థ్యానికి తగ్గట్టుగా ముందు ఉంటాను అని దృఢనిశ్చయంతో ఉండాలని , అమ్మాయిలు గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్నారు, వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా లక్ష్యం వైపు ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం సాధించాలనే తపన ప్రతి ఒక్కరి లో ఉండాలని, జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండువేల మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నామని , ఎమ్మెల్యేలు కూడా ఫ్రీ కోచింగ్ ఇప్పించడానికి ముందుకు వస్తున్నారని, చిన్న కష్టం వచ్చిందని అవకాశాన్ని వదులుకోవద్దుఅని, ముందు ముందు అనేక కష్టములు వస్తుంటాయని ,అందుకోసమే ప్రస్తుతం వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు.
1)తప్పకుండా మీ లక్ష్యాన్ని
ముందుగా నిర్ణయించుకోవాలి
2) అట్టి లక్ష్యానికి వెళ్లడానికి
దారులు ఏంటి
3) సీనియర్స్ చెప్పే సూచనలు
పాటించాలని అన్నారు.
యువత 14-16 గంటలకు తప్పకుండా చదవాలి అని, మంచి మెటీరియల్ ఎంచుకోవాలని, సిలబస్ సెలెక్ట్ చేసుకొని యువత త్వరగా తమ లక్ష్యాన్ని సాధించుకోవాలి అని తెలియజేశారు.
అనంతరం పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ బాసర జోన్ లో దాదాపు 1000 పోస్టులు పడే అవకాశం ఉన్నందున ,అందులో నిజామాబాద్ నుండి 500 వరకు పోస్టులు వచ్చే అవకాశం ఉన్నదని, యువత తప్పకుండా ఈ ఫ్రీ కోచింగ్ ను సద్వినియోగ పరుచుకోవాలి అనీ, తెలంగాణ రాష్ట్ర డి.జి.పి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ మరియు గౌరవ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు , మంచి ఫ్యాకల్టీ /స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయడం జరిగిందని , అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ కోసం మంచి నైపుణ్యత కలిగిన ఫిజికల్ డైరెక్టర్ ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పోలీసు శాఖలో(Hight) ఎత్తు తప్పకుండా ఉండాలని, ఎత్తు లేనివారు నిరుత్సాహ పడకుండా బాల్కొండ లో నిర్వహించే గ్రూప్ కోసం ఫ్రీ కోచింగ్ ఉపయోగించుకోగలరని, అభ్యర్థులు తమ ఫీడ్ బ్యాక్ ను కూడా ఇవ్వగలరని తెలియజేయడం జరిగింది.
తదుపరి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ సి.నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్., మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు .,ఐ.పీ.ఎస్.,గారి ఆధ్వర్యంలో అభ్యర్థుల (Hight) ఎత్తు చూడడం జరిగింది.
ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి( L&O)శ్రీ డాక్టర్ వినీత్. జీ, అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీమతి ఉషా విశ్వనాథ్ తిరునగరి, అదనపు డి.సి.పి (ఆపరేషన్స్) శ్రీ.నరేందర్ రెడ్డి, అదనపు డి.సి.పి(A.R) శ్రీ గిరి రాజు, నిజామాబాద్, ట్రాఫిక్ ఏ.సీ.పీ లు శ్రీ ఏ.వెంకటేశ్వర్, శ్రీ ప్రభాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు మరియు ఐ.టీ కోర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Comments
Post a Comment