*పోలీస్ సమీక్ష సమావేశం*

  *పోలీస్ ఆఫీసర్ సమీక్ష సమావేశం*
(నేటి నిఘా న్యూస్ మీడియా)


న్యూస్ లైన్ ప్రతినిధి (ఏప్రిల్ 2022.)
నిజామాబాద్ జిల్లా.

*నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్*
 పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పి లు మరియు సి.ఐ లు లతో ',*సమీక్షా సమావేశం*'   *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె .ఆర్. నాగరాజు, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది*
  
   ఈ సందర్భంగా నేడు పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ యందు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ చెందిన అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈ దిగువ తెలిపిన విషయాలు చర్చించారు.

1. నిజామాబాద్ లోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.

2. ఎటువంటి చిన్న నేరాలు జరగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో *నిఘా* వ్యవస్థ పటిష్ట పర్చడము

3. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బిట్ ల ఏర్పాటు రాత్రి సమయాలలో వాహనాల తనిఖీ చేసి దొంగతనాల నివారణకు కృషి చేయుట.
 
4. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆటోలలో, జీపుల లో సామర్థ్యానికి మించి ప్యాసింజర్ లను ఎక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొనుట

5. మహిళల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడూ సహకారం అందించాలని తెలియజేశారు

6. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని

7. సి.సి.టి.ఎన్.ఎస్ (క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం) యందు పోలీస్ స్టేషన్ లోని ఎఫ్.ఐ.ఆర్ కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు.

8. నిజామాబాద్ లోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ లోఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.

9. ఇప్పటివరకు జరిగిన నేరాలలో త్వరితగతిన *పరిశోధన* పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు.

10. కోర్టులలో ఉన్న కేసుల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయుట

11. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయుట

12. పెండింగ్లో ఉన్న ఎన్. బి.డబ్లూస్ లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయుట గురించి సూచించారు.

13. మట్కా,గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై ప్రత్యేకమైన *నిఘా* ఏర్పాటు మరియు లాడ్జిలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయడం.

14. మోటారు వాహనాల యాక్ట్ ప్రకారం గా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి


15. గ్రామాలలో అవగాహన సదస్సులను నిర్వహించడం చేయాలని

16. అలవాటుపడిన నేరస్తుల పై పీ.డీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు.

17. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు.

18. ముఖ్యంగా ఈ నెలలో జరిగే రాబోయే ఏ ఇతర పండుగల సందర్భంగా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగు బందోబస్తు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

        ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. అరవింద్ బాబు, అదనపు డి.సి.పి (లా అండ్ ఆర్డర్) శ్రీ డా..వినిత్. జి, అదనపు డి.సి.పి,( అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి, అదనపు డి.సి.పి (ఆపరేషన్స్) శ్రీ  ఎమ్. నరేందర్ రెడ్డి , పరిపాలన అధికారి (ఎ.ఓ)శ్రీ రామారావు, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ ,ట్రాఫిక్ ఏ.సీ.పీ లు ఎ. వెంకటేశ్వర్ ,రఘు, రామారావు, ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, సి. సి. ఆర్. బిసి.ఐ శ్రీ ముత్యాలు, సి.ఐలు ,ఎస్. ఐ లు మరియు ఐ.టి కోర్  సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026