పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ?
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(టీఎస్‌పీఎస్సీ) శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన జారీకి వీలుగా ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన సవరణ ప్రతిపాదనల్ని పరిశీలిస్తుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ప్రభుత్వ ఉత్తర్వులను సరిచూసి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో అదికారులు గుర్తిస్తారు. అన్నీ అనుకూలంగా ఉంటే గ్రూప్-1 ప్రకటన జారీపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముంది. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే రెండుమూడు రోజుల సమయమిచ్చి, సమగ్రమైన ప్రతిపాదనలు తీసుకుంటారు.
*19 విభాగాలు.. 503 పోస్టులు*
గ్రూప్-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో రెండు మూడు కేటగిరీల పోస్టులపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. మైనార్టీ సంక్షేమ అధికారుల పోస్టులు కొత్తగా వచ్చాయి. వాటిని గ్రూప్-1 కింద చేర్చుతూ ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. అలాగే డీఎస్పీ పోస్టులపై స్వల్ప సవరణ ప్రతిపాదనలు హోంశాఖ నుంచి అందాల్సి ఉంది. ‘‘సవరణ ప్రతిపాదనల కోసం నిరంతరం ఆయా శాఖల విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ సమీక్షించింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చింది. శనివారం జరిగే సమావేశంలో ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనలపై స్పష్టత రానుంది. ప్రతిపాదనలన్నీ తప్పులు లేకుండా, వివాదాలకు తావివ్వకుండా ఉంటే రెండురోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పొరపాట్లు ఉంటే మరోసారి కమిషన్ సమావేశమై నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటుంది’’ అని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపాయి.
2 నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
లేటెస్ట్ న్యూస్ కోసం సంప్రదించండి
NETI NIGHA NEWS MEDIA
Ads ☎️ 7097988840.
ఎడిటర్ ✍️ నిఘా న్యూస్
కట్టా నరేష్ కుమార్ నాయక్
జర్నలిస్ట్
Comments
Post a Comment