"ఆటో డ్రైవర్ ను అభినందించిన సీపీ"
*ఆటో డ్రైవర్ ను అభినందించిన సీపీ*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్
తేదీ:-28-04-2022
*"GOOD CITIZEN CERTIFICATE"*
*ఈచ్చి ఆటో డ్రైవర్ ను అభినందించిన పోలీస్ కమిషనర్*
తేదీ:- 27-04-2022 నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో గుమ్మిర్యాల్ గ్రామం నుండి ఎరుగట్ల మండల కేంద్రానికి ఆటో నెంబర్ :*TS 21 T 1086* గల ఆటో లో డ్రైవర్ *వడ్లూరు బాలరాజు* ప్యాసింజర్ ని తీసుకుని వస్తున్నాడు. అదే ఆటోలో వస్తున్న ఒక ప్యాసింజర్ ఒక పర్సును మర్చిపోయి ఆటో దిగిపోయింది.ప్యాసింజర్లు మొత్తం ఆటో దిగి వెళ్లిపోయిన అనంతరం అట్టి ఆటోలో ఒక పర్సును ఆటోడ్రైవర్ గుర్తించడం జరిగింది. అట్టి పర్సును గమనించగా అందులో దాదాపు 3 తులాల బంగారం తీగ, ఒక 1 చేతి ఉంగరం, వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. ఆ పర్సు కోసం చుట్టు ప్రక్కల వారిని అడగగా కానీ వాళ్లు ఆ ఆటోలొ ఎక్కలేదు అని తెలిపారు. అట్టి ఆటోడ్రైవర్ నిజాయితీ గా సంబంధిత ఏర్గట్ల పోలీస్స్టేషన్ ఎస్.ఐ శ్రీ కె. రాజు గారికి ఇవ్వడం జరిగింది. జరిగిన విషయం తెలియజేశారు అట్టి ఆటో డ్రైవర్ హుటాహుటిన ఎస్.ఐ.పి గారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయగా ఆ పర్సుకు సంబంధించిన వ్యక్తులు వచ్చి తీసుకోవడం జరిగింది.
*నేడు పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు, ఐపీఎస్,.గారు వడ్డూరి బాలరాజు గారికి" Good Citizen Certificate" ఇచ్చి అభినందిస్తూ ప్రశ్నించడం జరిగింది*.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ గారు నిజాయితీగా విధులు నిర్వహించి నేరం నియంత్రణకు కృషి చేశారని, ప్రతి ఆటో డ్రైవర్ ఇతనిని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్ ) ఉష విశ్వనాథ్ తిరునగరి, అదనపు డి.సి.పి (ఆపరేషన్) శ్రీ M. నరేందర్ రెడ్డి, పరిపాలనాధికారి (AO) శ్రీరామారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ,మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
*కె. ఆర్. నాగరాజు,IPS.,*
*కమిషనర్ ఆఫ్ పోలీస్*
*నిజామాబాద్* ఓ ప్రకటన లో తెలిపారు.
Comments
Post a Comment