"జర్నలిస్టుల పై దాడులు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్"

 *జర్నలిస్టులపై ప్రజా ప్రతినిధులు నాయకులు, దాడులు, బెదిరింపులు, వేధింపులు, పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలి*

*నేటి నిఘా న్యూస్*
(న్యూస్ లైన్ ప్రతినిధి ✍️భారత్)
*మోర్తాడ్(ఏప్రిల్ 26)*
 తెలంగాణ ఉద్యమంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎంతో కీలక పాత్ర పోషించడమే కాకుండా, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేసేలా నిత్యం కృషి చేస్తున్న జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు బెదిరింపులకు దాడులకు పాల్పడడం శోచనీయమని మోర్తాడ్ మండల ఏ వన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి నారాయణ, మరియు ప్రెస్ సోదరులు అన్నారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని లక్కోరసర్పంచ్ వేల్పూర్ మండలానికి చెందిన ఒక ప్రింట్ మీడియా రిపోర్టర్ పై దౌర్జన్యం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాడి చేయడం పట్ల ల క్కోరసర్పంచ్ జర్నలిస్ట్ పై దాడిని నిరసిస్తూ మోర్తాడ్ మండల ఏ వన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మోర్తాడ్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ,నిరసన, కార్యక్రమాన్ని మోర్తాడ్ మండల ఏ వన్ ప్రెస్క్లబ్ సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల తాసిల్దార్ కు వేల్పూర్ మండల జర్నలిస్టు పట్ల అనుచితంగా, దౌర్జన్యానికి పాల్పడ్డసర్పంచ్ పై కఠిన చర్యలు చేపట్టాలని మోర్తాడ్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి నారాయణ, ప్రెస్ క్లబ్ సోదరులు డిమాండ్ చేశారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన కొందరుప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లాలో జర్నలిస్టుల పట్ల వేధింపులకు పాల్పడడం దాడులు చేయడం తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది అన్నారు. ఎన్నడూ లేనిది ఎంతో అభివృద్ధి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇలాకాలో ఇటీవల జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు  జర్నలిస్టులను బెదిరింపులకు పాల్పడడం, దాడులు చేయడం, అనుచితంగా  వ్యవహరించడం మితిమీరి పోతుందన్నారు. ప్రింట్ మీడియా జర్నలిస్టులు గాని, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గాని వాస్తవ కథనాలు ప్రచురిస్తే ప్రజా ప్రతినిధులు నాయకులు సరిదిద్దుకోవాలి తప్ప జర్నలిస్టులపై దాడులు చేయడం, అనుచితంగా వ్యవహరించడం, వేధింపులకు పాల్పడడం సరికాదని, అది పార్టీకి ప్రభుత్వానికి నష్టమేనని ప్రజాప్రతినిధులు నాయకులు గుర్తించాలని పేర్కొన్నారు. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పై ఇలాగే దాడులు కొనసాగితే జర్నలిస్టులు ఐక్యతతో తీవ్ర ఉద్యమాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రాష్ట్రంలోనే బాల్కొండ నియోజకవర్గంను, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇలాకలో జర్నలిస్టులపై దాడులు వేధింపులు, దాడులు జరగకుండా కఠిన చర్యలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ప్రత్యేకచొరవ తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని, జర్నలిస్టులకు స్వేచ్ఛ స్వేచ్ఛాయుతవాతావరణం, మరోసారి దాడులు బెదిరింపులు జరగకుండా చూడాలని మోర్తాడ్ మండల జర్నలిస్టు కోరారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు  సురేష్, సాదిక్,  గంగాధర్, గట్టు భరత్,  చక్రధర్ గౌడ్, నరేందర్ గౌడ్, , పలువురు పాల్గొన్నారు.

నేటి నిఘా న్యూస్ మీడియా
ఎడిటర్
 కట్టా నరేశ్ కుమార్ నాయక్,7097988840.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026