*పోలీస్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్*

 *పోలీస్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
న్యూస్ లైన్ ప్రతినిధి. ఏప్రిల్.2022
(కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్ట్)

*డీ.జీ.పీ సార్  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు*
 
    *నేడు హైదరాబాద్ నుండి  తెలంగాణ రాష్ట్ర డి.జి.పి శ్రీ ఎం. మహేందర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.*

*ఈ సందర్భంగా చర్చించిన అంశాలు*

1)ఇప్పటివరకు జరిగిన నేరాలలో త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు.
2)కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయుట.
3)CCTNS (క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం) యందు PS లోని ఎఫ్.ఐ.ఆర్/కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు.
4)నిజాంబాద్ లోని పీఎస్ ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.
5)ఎటువంటి చిన్న నేరాలు జరగకుండా సంబంధిత పీ.ఎస్ పరిధిలో *"నిఘా"* వ్యవస్థ పటిష్టపరచడం.
6)అన్ని పీఎస్ పరిధిలో" పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ ల ఏర్పాటు, రాత్రి సమయాలలో వాహనాల తనిఖీ చేసి దొంగతనాలు నివారణకు కృషి చేయుట
7)రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆటోలలొ, జీపులలో సామర్ధ్యానికి మించి ప్యాసింజర్ లను ఎక్కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొనుట
8)బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
9)పెండింగ్ లో ఉన్న N.B.W ల పై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయుట గురించి సూచించారు.
10)11 వర్టికల్ వ్యవస్థల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది.
11)మట్కా,గ్యాంబ్లింగ్ గంజాయి మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై ప్రత్యేకమైన "నిఘా" ఏర్పాటు మరియు లాడ్జి ల లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయడం
12)మోటార్ వాహనాల యాక్ట్ ప్రకారంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి
13)పెండింగ్ చలానాలు కట్టే విధంగా చర్యలు తీసుకోవడం 14)గ్రామాలలో పోలీస్ కళాబృందాల ,ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించడం 
15)అలవాటుపడిన నేరస్తుల పై పీ.డీ యాక్ట్ నమోదు 
16)డయల్  100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు.

   ఈ సమావేశంలో *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్,.* అదనపు డి.సి.పి (అడ్మిన్) ఉష విశ్వనాథ్. టీ, అదనపు డీ.సీ.పీ (ఆపరేషన్) శ్రీ M. నరేందర్ రెడ్డి, పరిపాలన అధికారి(AO) శ్రీ రామారావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, శ్రీ వెంకటేశ్వర్లు ,రఘు, రామారావు, ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీహరి ,వర్టికల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

         *కె. ఆర్. నాగరాజు,IPS.,*
          *కమిషనర్ ఆఫ్ పోలీస్*
                 *నిజామాబాద్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమాచారాన్ని పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026