"నీటి కుంటాల దగ్గర పిల్లలు జాగ్రత్త"
"నీటి కుంటాల దగ్గర పిల్లలు జాగ్రత్త"
*నేటి నిఘా న్యూస్ మీడియా*
పోలీస్ కమిషనర్ కార్యాలయం
నిజామాబాద్
*నిలువగల నీటి వద్దకు, స్విమ్మింగ్ పుల్స్ లో చిన్న చిన్న కుంటల వద్దకు పిల్లలు వెళ్ళినట్లయితే తల్లిదండ్రులు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి.*
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ , ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో ప్రజలు వేసవికాలం ఉన్నందువలన తమ చిన్న పిల్లలకు స్కూలు సెలవులు ఉండటం వలన ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడికి తమ కుటుంబ పెద్దలకు తెలియజేయకుండా నే ఈత కొట్టడం కోసం వెళ్తుంటారు వారి పట్ల కుటుంబ పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె ఆర్ నాగరాజు, ఐ, పి, యస్,, గారు ఈ దిగువ విధంగా తెలియజేయడం జరిగింది.
🔹నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి వేసవి కాలంలో ఈత చేయడానికి వెళ్ళిన చిన్న పిల్లలు చనిపోయిన సందర్భంలో చాలా ఉండటం బాధాకరం.
🔹చాలా ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా కొన్ని మురము తవ్వడం వలన గుంతలు ఏర్పడినది,అందులో వర్షాకాలం సమయంలో నీళ్లు నిండడం వలన అవి ఎంత లోతు ఉన్నాయో తెలవదు, అలాంటి ప్రదేశాలకు చిన్న పిల్లలు ఈత చేయడానికి తల్లిదండ్రులకు తెరవకుండానే వెళ్తుంటారు, కావున ప్రజలు తమ పిల్లలను ఆ నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించగలరు.
🔹కొన్ని మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న కుంటలు, కాలువలు ఉంటాయి మట్టి నీటిలో చిన్న పిల్లలు ఈత కొట్టడానికి వెళ్తుంటారు అలాంటి పిల్లలతో పాటు ఈత తెలిసిన వ్యక్తులు గాని లేదా కోతులు గాని ఉండే విధంగా చూసుకోవాలి.
🔹స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కూడా వారి వారి వద్దకు వచ్చి సిమ్మింగ్ నేర్చుకుని వారికి అనుభవజ్ఞులైన కోచుల పర్యవేక్షణలో నిర్వహించాలని, ఒకవేళ సిమ్మింగ్ ఫూల్ నిర్వాహకులు తగు జాగ్రత్తలు నిబంధనల ప్రకారం తీసుకున్నట్లయితే వారిపట్ల చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.
🔹ప్రతి ఒక్కరూ సిమ్మింగ్ తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించాలని ప్రతి ఒక్కరికీ జీవితంలో సిమ్మింగ్ ఎప్పుడూ ఏవిధంగా అవసరం అవుతుందో తెలియదని, అవసరానికి అనుకూలంగా తమ, లేదా ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చును అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె ఆర్ నాగరాజు, ఐ, పి, యస్ గారు తెలియజేశారు.
*కె. ఆర్. నాగరాజు, IPS.,*
*కమిషనర్ ఆఫ్ పోలీస్*
*నిజామాబాద్*
నేటి నిఘా న్యూస్ మీడియా సమావేశం లో తెలిపారు.
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
Ads 7097988840
ఎడిటర్ నేటి నిఘా న్యూస్
కట్టా నరేష్ కుమార్ నాయక్
జర్నలిస్ట్
Comments
Post a Comment