"ఉద్యోగాల పేరు తో మోసం నిందితుల అరెస్ట్"

 *సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసంచేసిన ఇద్దరు నిందితుల  అరెస్ట్* 
నేటి నిఘా న్యూస్ మీడియా


*అక్రమమైన మార్గం లో ఉద్యోగం పొందటం కూడా నేరంగానే పరిగణించబడుతుంది: గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపెల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో  రామయ్యపల్లి గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ కొడుకు  పూదరి అనిల్ కు సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తాను అని కొత్తగూడెం కు  చెందిన పుచ్చకాయల సాంబశివరావు మరియు అతని కొడుకు పుచ్చకాయల గోవర్ధన్ రావు అను ఇద్దరు వ్యక్తులు 7 లక్షల రూపాయలు మాయమాటలు చెప్పి తీసుకొని మోసం చేయగా ఈరోజు వారిద్దరిని రామగిరి పోలీసులు అరెస్టు  చేయనైనది.

 ఈ సందర్భంగా గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్ గారు మాట్లాడుతూ  ఈ మధ్య కాలంలో  కొంతమంది కొంతమంది వ్యక్తులు సులభంగా  డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారిని, వారి అవసరాలను ఆసరాగా తీసుకుని అమాయక వ్యక్తులని ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుగా డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తాం అని  మోసం చేస్తున్న వంటి వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. వారిపై కేసు నమోదు చేసి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం, పి.డి యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికె ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగింది. అదే విధంగా అక్రమమైన మార్గంలో ఉద్యోగం పొందటం కూడా చట్టరీత్యా నేరం గానే పరిగణించబడుతుంది. కావున ఎవరు కూడా ఆ దారిని ఎంచుకోవద్దు అని గోదావరిఖని  ఎసిపి గారు తెలపడం జరిగినది.

*గమనిక*:- *డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పే వ్యక్తులను ప్రజలు ఎవరు కూడా నమ్మి మోస పోకూడదని ఈ సందర్భంగా చెప్పుతూ, అక్రమమైన మార్గంలో ఉద్యోగం పొందటం కూడా నేరం పరిగణించబడుతుంది.*
 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026