"పాలి సెట్ ఆలస్యం"

*పాలిసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం*

 నేటి నిఘా న్యూస్.
 హైదరాబాద్‌: పాలిసెట్‌కు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ఈ నెల రెండో వారంలో మొదలవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) ప్రకటించినా అది ఆలస్యం కానుంది. కనీసం మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా. పాలిసెట్‌ టైంటేబుల్‌ను ఎస్‌బీ టెట్‌ అధికారులు మార్చి 24న విడుదల చేశారు. రిజిస్ట్రేషన్‌ రెండో వారంలో మొదలవుతుందని ప్రకటించినా అది ప్రారంభం కాలేదు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్‌ నంబర్లు కేటాయిస్తేనే పాలిసెట్‌ దరఖాస్తుల సమర్పణ సాధ్యమవుతుంది. విద్యార్థులు పదో తరగతి పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 14వ తేదీతో ముగిసింది.
 తత్కాల్‌ పథకం కింద రూ.వెయ్యి ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 20 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత కూడా తప్పొప్పులను సరిచూసుకొని... హాల్‌టికెట్ల సంఖ్యలను కేటాయించడానికి మరో వారం రోజులు పట్టొచ్చని అంచనా. అంటే ఈ నెలాఖరుకు మాత్రమే పాలిసెట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026