✊"మే డే శ్రామికులరోజు" ✊

*శ్రమదోపిడీని నిరసిస్తూ... మే డే✊✊✊ 
"నేటి నిఘా న్యూస్ ✍️స్పెషల్ స్టోరీ"
యావత్‌ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ... వేసిన ముందడుగే మే డే.* 
 
*కార్మిక,కర్షకులకు మే డే శుభాకాంక్షలు* 

 *మేడే సందర్భంగా ప్రత్యేక కథనం....* 
19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా ఆమెరికా, యూరప్‌ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో కనీసం రోజుకు 16 గంటల నుండి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరియైన గాలి, వెలుతురు ఉండేవికావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. కార్మికులు వారి శ్రమను మరచిపోవడానికి పాటలుపాడినా, విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రిక్తులై ధిక్కార నేరం క్రింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటుధోరణి మొదలైంది. కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో చైతన్యవంతులైన కార్మికులు 1806లో మెకానిక్స్‌ యూనియన్‌ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్‌ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది.ఆ పోరాట జ్వాలలు బ్రిటన్‌, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి. 1818లో ఇంగ్లాండులోని స్టాల్‌పోర్టు పట్టణంలో బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు సమ్మె ప్రారంభించారు. ప్రపంచ పరిశ్రమలకు ప్రసిద్ధిచెందిన లయాన్స్‌ పట్టణంలో 1831-1834లలో కార్మికులు తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో ప్యారిస్‌లో కూడా పోరాటాలు జరిగాయి. అదే సమయంలో జర్మనీ, ఆస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో ప్యారిస్‌లో కూడా సమ్మెలు జరిగాయి. జర్మనీ, అస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాట్లు జరిగాయి. 1886మే1 అమెరికాలోని చికాగోలో 18 గంటల పనివిధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం ప్రవేశపెట్టాలని కోరుతూ పోరాటానికి దిగారు. ఆ ఉద్యమంలో అనేకమంది కార్మికులు అమరులై తమ హక్కును సాధించుకున్నారు. వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే. మన దేశంలో మొట్టమొదటి సారి మద్రాసు కేంద్రంగా 1923వ సంవత్సరం మే1వ తేదిన లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆఫ్‌ హిందుస్థాన్‌ అధ్వర్యంలో మే డే ఉత్సవాలను నిర్వహించారు. అలా మొదలై నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు.
మే 1.. అంటే ‘మేడే’. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది. ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానీ ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అది అనేక దేశాల్లో ఉద్యమాలకు దారి తీసింది. షికాగోలో చనిపోయిన కార్మికులను స్మరిస్తూ.. 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది. 1923లో తొలిసారిగా భారత్‌లో ‘మే డే’ను పాటించారు. ప్రస్తుతం కరోనా వల్ల ఎంతోమంది శ్రమ జీవులు ఉపాధి కోల్పోయారు. వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యం. ఈ కొటేషన్స్‌తో వారిలో విశ్వాసం నింపుదాం.
ప్రపంచ కరోనా కారణంగా మన ఉపాధిని చిదిమేయొచ్చు..
కానీ,మన ధైర్యాన్ని.. స్థైర్యాన్ని కాదు..మంచి రోజుల కోసం ఎదురుచూద్దాం..
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి,నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలునా వినుతించే, నా విరుతించేనా వినిపించే నవీనగీతికి నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం- *శ్రీ శ్రీ* 
 *మరో ప్రపంచం, మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది..* 
పదండి ముందుకు.. పదండి త్రోసుకు.. పోదాం, పొదాం పైపైకి.
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి,
పోరాడి సాధించిన రోజు ఈ మేడే.
 శ్రమే జీవితం..
శ్రమే లక్ష్యం..
శ్రమతోనే భవిష్యత్తు..
శ్రమే దైవం...
శ్రమే మన ఇలవేల్పు..
శ్రమజీవులకు 
శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం.
చెమట చుక్క విలువను కాపాడుకుందాం.
ఇది కష్టకాలం..
కరోనా కారణంగా మన ఉపాధిని చిదిమినా..
ధైర్యంతో ముందుకు సాగుదాం..
మంచి రోజుల కోసం ఎదురుచూద్దాం..
రెట్టింపు ఉత్సాహంతో శ్రమిద్దాం..
జీవితాన్ని మళ్లీ వెలుగులు నింపుకుందాం.
కార్మికుల చెమట కష్టం..
బంగారం కన్నా ఎక్కువ విలువైనది
వజ్రం కన్నా కాంతివంతమైనది
ముత్యాల కన్నా అందమైనది.
కలిసి కట్టుగా మన హక్కులపై పోరాడుదాం.
కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలుకార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన రోజు ఈ మేడే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాాంక్షలు చెప్పేద్దామా.
సేకరణ: పోతుగంటి సంపత్ కుమార్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026