"ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు పై సమీక్ష సమావేశం"

 *ఇంటర్ పరీక్షల పై సమీక్ష సమావేశం*
"నేటి నిఘా న్యూస్ మీడియా"

అధికారుల సమన్వయంతో ఇంటర్  ...పరీక్షలు ...... అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా:::::: జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇంటర్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం న్యూ అంబేద్కర్ భవన్ లో  చీఫ్ సూపరిండెంట్ లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ   RAGHURAJ అధ్యక్షత వహించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ సంవత్సరం పూర్తిగా ఎండాకాలంలో నిర్వహిస్తున్నందున ప్రతి కళాశాలలో మంచి నీటి వసతి,  మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలో  ఆశా వర్కర్ల ను పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే సమయానికి ఆర్టీసీ బస్సులు నడపడం, నిరంతర విద్యుత్ సరఫరా,   అలాగే శానిటేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ లు,  గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో అన్ని పరీక్షా కేంద్రాలను ప్రతి రోజు  సానటీశన్ చేయడం జరుగుతుందని అని తెలియజేశారు. ప్రతి ఎగ్జామినేషన్ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు 
ఎం.పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థులు ఇళ్లకు  వెళ్లేందుకు బస్సు స్టాండ లకు చేరుకునేoదుకు ప్రైవేట్ కళాశాలల బస్సు లు యేర్పాటు చేసేందుకు ప్రయత్నo చేస్తామన్నారు.  పరీక్షల కు ముందు, జరుగుతున్న సమయంలో, పరీక్షలు పూర్తయిన తర్వాత చేయవలసిన అన్ని ఏర్పాట్లను నిబంధనల ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. 
అలాగే విద్యార్థులకు మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లను, అలాగే మానసిక ఇబ్బందులు తొలగించేందుకు డాక్టర్  సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారని తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అలాగే పరీక్షలు పూర్తయిన తర్వాత జాగ్రత్తగా పోస్ట్ ఆఫీస్ కు బండిల ను జాగ్రత్త గా తరలించాలని ఆమె సూచించారు. పరీక్షల నిర్వహణలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించారదని మూడు గంటల పాటు తమ విధులను పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉండాలని అన్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా సెల్ ఫోన్లను గాని ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పరీక్ష కేంద్రాల్లో కి తీసుకురావద్దని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రాఘరాజు మాట్లాడుతూ జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు  చీఫ్ సూపరింటెండెంట్ లకు  డిపార్ట్ మెంట్  అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు , మంచి నీటి వసతి,  శానిటేషన్ చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలను  సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను పరీక్ష ముందు ఏర్పాట్లు పరీక్ష జరుగుతున్నప్పుడు పరీక్ష పూర్తయిన తర్వాత చేయవలసిన చర్యలన్నీ సక్రమంగా చేయాలని లేనట్లయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. పరీక్షలకు  గైర్ హాజరైన విద్యార్థుల సమాచారం వెంటనే ఆన్లైన్లో పంపాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే పరీక్షల నిర్వహణ కమిటీ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇంటర్ విద్యా అధికారి  అన్నారు .పరీక్షలను నిర్వహించడం లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అన్నారు. విద్యార్థులకు  మానసిక ఒత్తిడుల నుండి దూరం చేయడానికి రాష్ట్ర స్థాయి లో 18005999333 టోల్ ఫ్రీ నెంబర్,  ,జిల్లా స్థాయిలో మానసిక వైద్య నిపుణులు మరియు అధ్యాపకులను నియమించామని ఎలాంటి  ఇబ్బందులెదురైనా డాక్టర్ విశాల్ 9985075295, యెల్ . మహేష్ 9440541373, టి. శ్రీహరి 9491622838, యన్.  నవీన్ 9441055123,  ప్రవీణ్ రెడ్డి 9849230134 ఫోన్  నెంబర్ లను విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించాలని ఇంటర్  విద్యా అధికారి తెలిపారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య , శ్రీమతి కనకమహాలక్ష్మి , హైపవర్ కమిటీ రవి కుమార్ లు చీఫ్ సూపరింటెండెంట్, బల్కు అధికారి  రజుయుదిను డిపార్ట్మెంట్ అధికారులకు అన్ని అంశాలలో శిక్షణ ఇచ్చారు.అలాగే ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నరసయ్య,  ప్రధాన కార్యదర్శి నారాయణ  ప్రిన్సిపల్ ల సంఘం ఉపాధ్యక్షుడు  చంద్ర విట్టల్ ,  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

నేటి నిఘా న్యూస్ మీడియా
Ads 7097988840.
లేటెస్ట్ న్యూస్ కోసం సంప్రదించండి
NETI NIGHA NEWS LIVE CHANNEL
నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026